ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలపై అశ్లీలం; యూట్యూబర్ పై కరాటే కళ్యాణి దాడి
నటి కరాటే కళ్యాణి మరోమారు వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె శ్రీకాంత్ రెడ్డి అనే ఓ యూట్యూబర్ పై దాడి చేసి వార్తల్లోకెక్కారు. శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు యూట్యూబర్ గా పని చేస్తున్నాడు. ఇతను చాలా మంది మహిళలను అగౌరవ పరుస్తూ వీడియోలు తీస్తూ ఆ వీడియోల ద్వారా పాపులర్ అవుతున్నాడు. అమ్మాయిలతో పచ్చి బూతులు మాట్లాడుతూ వీడియోలు చేయిస్తున్నాడు.
మహిళలను కించపరుస్తూ వీడియోలు చేస్తుండటంతో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి పై ఫైర్ అయ్యింది. కరాటే కళ్యాణి నివాసముండే యూసఫ్ గూడా ఏరియాలోనే శ్రీకాంత్ రెడ్డి కూడా నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఫ్రాంక్ వీడియోల పేరుతో మహిళలపై ఇష్టమొచ్చినట్టు అసభ్యకర వీడియోలు తీస్తున్న శ్రీకాంత్ రెడ్డి పై గురువారం రాత్రి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడు అంటూ కరాటే కళ్యాణి నిప్పులు జరిగింది.

గురువారం రాత్రి చంటి బిడ్డతో పాటు శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి నిలదీసిన కరాటే కళ్యాణి అతని చెంప పగల కొట్టింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీకాంత్ ను కళ్యాణి చితకబాదగా, శ్రీకాంత్ కూడా తిరిగి కళ్యాణ్ పై దాడి చేశాడు. దీంతో చంతిబిద్దతో పాటు కరాటే కళ్యాణి క్రింద పడిపోయింది. ఆపై ఆమె శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ శ్రీకాంత్ రెడ్డిని ఆమె తరిమి తరిమి కొడుతున్న వీడియోను కరాటే కళ్యాణి తన ఫేస్ బుక్ లైవ్ లో పెట్టింది.
ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో ఘర్షణ నేపథ్యంలో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని, తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసింది కరాటే కళ్యాణి. శ్రీకాంత్ రెడ్డి కూడా తనపై కరాటే కళ్యాణి దాడి చేసిందని ఫిర్యాదు చేశారు.