అమ్మాయిది ఫ్రాన్స్ , అబ్బాయిది కరీంనగర్ , ప్రేమించుకొన్నారు, పెద్దలు ఏం చేశారంటే
ఫ్రాన్స్ కు చెందిన సఖినా గ్రిల్స్ అనే యువతిని జమ్మికుంటకుచెందిన చిరంజీవి అనే యువకుడు శుక్రవారంనాడు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నాడు. వధువు తదరపు బంధువులు కూడ ఈ వివాహన్ని చూసేందుకు ఫ్రాన్స
కరీంనగర్ :అమ్మాయిది ప్రాన్స్ ,అబ్బాయిది కరీంనగర్ జిల్లా. వీరిద్దరూ ప్రేమించుకొన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారంగా వీరిద్దరూ కరీంనగర్ లో వివాహం చేసుకొన్నారు. వధువు తరపు బందువులు కూడ ఈ వివాహానికి హజరయ్యారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన పరశురాములు, వీరలక్ష్మి దంపతుల కుమారుడు చిరంజీవి మూడేళ్ళ క్రితం ఫ్రాన్స్ వెళ్ళాడు. ప్రాన్స్ లోని యూనివర్శిటీలో ఆయన పిహెచ్ డి చేస్తున్న సమయంలో అదే యూనివర్శిటీలో ఎంఎస్ సి చేస్తోన్న సఖినా గ్రిల్స్ అనే యువతితో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే ప్రాన్స్ కు చెందిన సఖినా ను వివాహం చేసుకోవాలని చిరంజీవి అనుకొన్నాడు,. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు కూడ చెప్పాడు. అయితే ఈ వివాహానికి వారి తల్లిదండ్రులు కూడ ఒప్పుకొన్నారు. సఖినా తరపు తల్లిదండ్రులు కూడ ఈ వివాహనికి అంగీకరించారు.
దీంతో వీరిద్దరి వివాహాన్ని హిందూ సంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వధువు తల్లిదండ్రులు, వారి బంధువులను కూడ ఈ వివాహానికి ఆహ్వనించారు.
శుక్రవారం నాడు మధ్యాహ్నం జమ్మికుంటలోని ఫంక్షన్ హాల్ లో ఫ్రాన్స్ యువతిని చిరంజీవి వివాహం చేసుకొన్నాడు.విదేశీ యువతిని చిరంజీవి వివాహం చేసుకొంటున్నాడని తెలిసి స్థానికులు కొందరు కూడ ఈ వివాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున హజరయ్యారు.












Click it and Unblock the Notifications