సిద్ధరామయ్య వర్సెస్ కేటీఆర్..!!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తోన్నాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

 Karnataka CM Siddaramaiah will campaign in Telangana

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేసీఆర్ సుడిగాలి పర్యటలను చేస్తోన్నారు. నేడు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పాలేరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అటు కాంగ్రెస్, బీజేపీ.. తమ ప్రచార కార్యక్రమాలను తీవ్రతరం చేశాయి. బస్సు యాత్రలను నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే తొలి విడత బస్సు యాత్ర పూర్తయింది. శనివారం నుంచి రెండో విడత బస్సు యాత్ర మొదలు కానుంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ సీనియర్లు ఇందులో పాల్గొననున్నారు.

ఈ బస్సు యాత్రలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనబోతోన్నారు. ఈ నెల 28 లేదా 30, 31 తేదీల్లో ఆయన బస్సు యాత్రలో పాల్గొంటారు. పార్టీ సీనియర్ నేతలు- రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి సిద్ధరామయ్య.. బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో జరిగే సభలకు హాజరవుతారని తెలుస్తోంది.

కర్ణాటకలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు సిద్ధరామయ్య. అయిదు గ్యారంటీల గురించి వివరించనున్నారు. శక్తి, గృహలక్ష్మి, గృహజ్యోతి.. వంటి పథకాలపై మాట్లాడనున్నారు. ఇదే తరహా హామీలను కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే.

ఇదివరకు కర్ణాటక ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు, ఆరోపణలను సిద్ధరామయ్య తిప్పికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కర్ణాటక ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ ఆరోపించారు కేటీఆర్. వ్యవసాయానికి విద్యుత్‌ను కూడా సరఫరా చేయలేకపోతోందంటూ మండిపడ్డారు. వాటన్నింటిపైనా సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+