'అతడు' పట్టుబడితే నయీం ఘోరాలు: 20 ఏళ్ల డేటా, తెరపైకి 'విశాఖ'
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో ఎన్‌కౌంటర్ అయిన గ్యాంగ్ స్టర్ నయీం యాక్షన్ టీంలో శేషన్న కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. పలువురి హత్య కేసులో శేషన్న కీలక నిందితుడిగా విచారణాధికారులు గుర్తించారని సమాచారం.
నయీం ఎన్‌కౌంటర్ అనంతరం శేషన్న కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతని కోసం మూడు రాష్ట్రాలలో వెతుకుతున్నారు. కాశన్న దొరికితే నయీం గురించిన మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముందని తెలుస్తోంది. నయీం గ్యాంగులో శేషన్న నెంబర్ 2గా ఎదిగారని సమాచారం.

విశాఖలో నయీం మూలాలు
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తవ్విన కొద్ది ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు అధికారులు, రాజకీయ నాయకులతో నయీంకు సంబంధాలు ఉన్నాయి. అలాగే, పలువురిని అతని బెదిరించాడు. ఏపీలో తాజాగా విశాఖలోను నయీం మూలాలు బయటపడ్డాయని తెలుస్తోంది.
ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) దీని పైన దృష్టి సారించింది. రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజీ, ప్రయాణీకుల లిస్టును పరిశీలిస్తున్నారు. విశాఖలో నయీంకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ఎవరిని కలిసేందుకు అతను అక్కడకు వెళ్లాడనే విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు.
నయీం ఇంట్లో 20 ఏళ్ల డేటా
తనకు ఎప్పటికైనా చావు తప్పదని భావించిన నయీం.. తనతో సంబంధాలు కలిగిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల చిట్టా అందరికీ తెలిసేందుకు, వారికి శిక్ష పడేందుకు ఇరవై ఏళ్ల డేటా భద్రంగా ఉంచాడు. నయీంకు ఐన వాళ్ల పైన కూడా అనుమానమేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications