కేసీఆర్‌పై తిరుగుబాటే: కత్తి మహేష్, పవన్‌పై తీవ్ర విమర్శలు
హైదరాబాద్: ఇప్పటి వరకు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఇప్పుడు తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బుధవారం చంచల్‌గూడ జైలులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ మాట్లాడారు.

కేసీఆర్ సర్కారుపై కత్తి
అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని అన్నారు. ఎమ్మార్పీఎస్‌కు తన మద్దతు ఉంటుందని కత్తి మహేష్ ప్రకటించారు.
Recommended Video


జనం లేని పార్టీ
పవన్ కళ్యాణ్‌పై కూడా కత్తి మహేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. జనసేన తోక పార్టీ అని, పవన్ తప్ప ఆ పార్టీలో జనమే లేరని ఎద్దేవా చేశారు. జనసేనను ఎవరైనా రాజకీయ పార్టీ అంటారా? అని ప్రశ్నించారు.

పూనంపై ప్రశ్న
నటి పూనమ్ కౌర్‌పై తన ప్రశ్నలకు పవన్ స్పందించాలని ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. సినీ అభిమానులను పవన్ మోసం చేస్తున్నారని కత్తి ఆరోపించారు.

కోన వెంకట్‌కు కత్తి ట్వీట్
కాగా, పవన్ కల్యాణ్‌పై కత్తి మహేశ్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రముఖ రచయిత కోన వెంకట్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కోనవెంకట్‌కు కత్తి మహేశ్ ఓ ట్వీట్ చేశారు. ఈ విషయంలో తాను మౌనంగానే ఉన్నా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వేధింపులు మాత్రం తగ్గడంలేదని, ఏం చేయమంటారని ప్రశ్నించారు.

కత్తికి ఘాటు కౌంటర్
ఈ ట్వీట్‌కు వెంటనే కోన వెంకట్ సమాధానం ఇచ్చారు. ‘దురదృష్టవశాత్తు నేను జనవరి 7న ట్వీట్ పెట్టిన తరువాత కూడా నువ్వు ఇదే అంశంపై కొన్ని ఛానెళ్లతో మాట్లాడావు. పవన్ కల్యాణ్, అతని అభిమానులను ఎటాక్ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా?' అని కోన వెంకట్ తన ఘాటుగా స్పందించారు.












Click it and Unblock the Notifications