Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివాహేతర సంబంధం: భర్తకు తెలుస్తోందని కూతురును చంపేసి నాటకం

హైదరాబాద్: వివాహేతర సంబంధాన్ని భర్తకు చెబుతోందనే ఉద్దేశ్యంతో సవతి కూతురును హత్య చేసిన ఘటన వరంగ్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూడూర్‌లో చోటు చేసుకొంది. నిందితురాలైన హరికను ఆమెకు సహకరించిన మరో మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.

భర్త లేని సమయంలో ఇతరులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని సవతి కూతురు చూసింది. అయితే ఈ విషయాన్ని తండ్రికి చెబుతోందని భయపడి సవతి కూతురును హత్య చేసింది.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరుకు చెందిన పి. కరుణాకర్ 18 ఏళ్ళ క్రితం శ్రీదేవిని ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. వారికి ఇద్దరు కూతుళ్ళు. అయితే కొంతకాలం తర్వాత శ్రీదేవి ఆత్మహత్య చేసుకొంది.

రెండో వివాహం చేసుకొన్న కరుణాకర్

రెండో వివాహం చేసుకొన్న కరుణాకర్

శ్రీదేవి ఆత్మహత్య చేసుకోవడంతో కరుణాకర్ 2011లో హరికను రెండో వివాహం చేసుకొన్నాడు. హరికను వివాహం చేసుకొనే ముందే శ్రీదేవితో తనకు కలిగిన ఇద్దరు అమ్మాయిల పేర్లపై ఆస్థిని రాశాడు. హరికను వివాహం చేసుకొన్న తర్వాత కరుణాకర్, హరికకు ఓ కొడుకు పుట్టాడు అయితే హరిక మాత్రం శ్రీదేవి పెద్ద కూతురు కావేరితో గొడవకు దిగేది. దీంతో పలు మార్లు పెద్ద మనుషులు హరికను మందలించారు.

హరిక ఇతరులతో వివాహేతర సంబంధం

హరిక ఇతరులతో వివాహేతర సంబంధం

కరుణాకర్ ఇటీవల కాలంలో అయ్యప్ప మాల ధరించాడు. అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్ళాడు. ఆ సమయంలో హరిక గ్రామంలోని ఇతర పురుషులతో వివాహేతర సంబంధాలను పెట్టుకొంది. అదే గ్రామానికి చెంది అయిలమ్మ సహకారంతో హరిక వివాహేతర సంబందాన్ని కొనసాగిస్తోంది. ఒకరోజున ఈ ఘటనను కావేరి చూసింది అంతేకాదు తండ్రికి చెబుతానంది. దీంతో కావేరిని హత్య చేయాలని హరిక నిర్ణయించుకొంది.

 నిద్రిస్తున్న సమయంలోనే హత్య

నిద్రిస్తున్న సమయంలోనే హత్య

జనవరి 5వ, తేదిన కావేరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే అదే గ్రామానికి చెందిన మరో మహిళ అయిలమ్మ సహకారంతో హరిక కావేరిని హత్య చేసింది. చున్నీతో గొంతు నులిమి కావేరిని చంపేసింది. అంతేకాదు హత్య చేసిన తర్వాత కావేరి దుస్తులను మార్చేసింది.

 అనారోగ్యంతో మరణించిందని సమాచారం

అనారోగ్యంతో మరణించిందని సమాచారం

జనవరి 6వ, తేదిన హరిక ఏమి తెలియనట్టుగానే నటించింది. ఇంట్లో పూజ చేసేందుకు వీలుగా ఇంటిని శుభ్రపర్చింది. అంతేకాదు కావేరి సోదరికి అక్కను లేపాలని పురమాయించింది. అయితే కావేరి ఎంతకు లేవకపోవడంతో అనారోగ్యంతో కావేరి మరణించిందని బంధువులకు సమాచారమిచ్చింది. ఈ విషయమై కావేరి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+