హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపిపై విరుచుకుపడ్డ కవిత, పవన్ కళ్యాణ్‌కు కెసిఆర్ బుద్ధి చెప్పారా? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఆంధ్ర ప్రాంతం వారి ఓట్లకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బీజేపీ-టీడీపీ ప్రచారానికి దింపుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు.

కానీ వారి ఆశలు అడియాసలేనని, మేకప్ వేసుకొని వచ్చి ఆ తర్వాత ప్యాకప్ చెప్పే వాళ్లను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. కొంచెం తిక్కున్న పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడో చుక్కలు చూపించారన్నారు.

పప్పన్నం తినైనా తాము ఇక్కడే ఉంటామని, అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎంతోమంది ఆంధ్రావారు సైతం లబ్ధిపొందారన్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటి పార్టీగా భావిస్తున్నారని, అన్ని ప్రాంతాల్లో పార్టీకి మంచి ఇమేజ్ ఉందన్నారు.

కవిత

కవిత

హైదరాబాద్‌కు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకువస్తే సంతోషిస్తామని, బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే వీలైనన్ని ఎక్కువ నిధులు తెప్పించాలని కవిత సవాల్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.

కవిత

కవిత

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగరడం ఖాయమని, అయిదేళ్లపాటు అధికారాన్ని అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కవిత చెప్పారు.

కవిత

కవిత

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు ఏదో చేస్తారని బీజేపీ నేతలు అబద్ధాలాడుతున్నారని ఎంపీ కవిత విమర్శించారు. హైదరాబాద్‌కు రూ.20వేల కోట్ల ప్యాకేజీ తీసుకువస్తే తాను కూడా బీజేపీకి ఓటేస్తానన్న వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని చెప్పారు. ఇది వారి నైజాన్ని బయటపెట్టిందన్నారు.

కవిత

కవిత

హైదరాబాద్‌కు ప్యాకేజీ తీసుకురమ్మంటే తెలంగాణకు రోడ్ల అభివృద్ధి నిధుల గురించి కేంద్రమంత్రి దత్తాత్రేయలాంటి వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్‌పై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే ఎక్కువ నిధులు తీసుకువస్తే సంతోషమన్నారు.

కవిత

కవిత

బీజేపీ తోక పార్టీ టీడీపీ సెటిలర్లలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాల్ని, పార్టీల వైఖరుల్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్తారన్నారు.

English summary
cranky Pawan Kalyan was taught a lesson by KCR, MP Kavitha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X