రైతులకు సాయం పేరుతో కవిత వసూళ్లు: రమణ, కోదండరామ్‌తో భేటీ

హైదరాబాద్: రైతు కుటుంబాలకు నష్టపరిహారం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై కెసిఆర్‌కు కనువిప్పు కలిగించాలని ఆయన కవితను కోరారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు ఎల్‌ రమణ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీలో ఆరులక్షల ఓట్లను తొలగించారని, వారి వివరాలను ఈసీకి అంజేశామన్నారు. దీనిపై శుక్రవారంలోగా ఈసీ స్పందించాలని రమణ డిమాండు చేశారు.

Kavitha collecting money: Ramana

కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాజకీయ జెఎసిని ఏర్పాటు చేసిన కోదండరామ్ తెలంగాణ సాధించారని ఎల్ రమణ అన్నారు. కోదండరామ్ పదవీ విరమణ సందర్భంగా సికింద్రాబాదులోని తార్నాకాలో గల ఇంటిలో కోదండరామ్‌ను ఆయన మంగళవారంనాడు కలిశారు. రైతాంగం కోసం ఉద్యమ సాధన చేస్తున్న అఖిల పక్ష పార్టీలకు మద్దతు తెలపాలని ఆయన కోదండరామ్‌ను కోరారు.

రాష్ట్రంలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆఆర్ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు .మాట నిలబెట్టుకునే అలవాటు కేసిఆర్‌కు లేదని ఆయన అన్నారు.

మంగళవారం టిడిపి, బిజెపి నేతలు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాయి. ఆ తర్వాత సహకార బ్యాంకు వద్ద దర్నాకు వెళ్తున్న టిడిపి బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+