అంతర్జాతీయ స్విమ్మర్‌కు ఎంపి కవిత ఆర్థిక సాయం

హైదరాబాద్: అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన నిజామాబాద్ పట్టణంలోని గాజుల్‌పేట్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ నవాతె శ్రీనివాస్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత రూ.1.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శ్రీనివాస్‌కు చెక్ అందజేశారు.

నిరుడు జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్‌లో శ్రీనివాస్ రెండు రజతాలు, ఓ కాంస్యంతో సత్తాచాటాడు. ఇలా జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్న శ్రీనివాస్ ఆగస్టు 5నుంచి రష్యాలో జరుగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలకు ఎంపికయ్యాడు.

 Kavitha Gives Rs 1.5L Assistance to Cop for Swimming Contest

కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు అడిషనల్ డైరెక్టర్ జనరల్(స్పోర్ట్స్) రాజీవ్ త్రివేదితో పాటు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు.

నవాతే శ్రీనివాస్ ఇప్పటివరకు అనేక జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ సంవతసరం జనవరిలో కేరళలో జరిగిన నేషనల్ గేమ్స్ లోనూ మంచి ప్రతిభ కనబర్చాడు. 2012 లో భోపాల్ లో జరిగిన జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో కూడా వంద మీటర్ల స్విమ్మింగ్ (బ్యాక్ స్ట్రోక్ స్టైల్)లో, 4 X 50 మెడ్లే రిలే విభాగాల్లో స్వర్ణ పథకాలు సాధించాడు.

 Kavitha Gives Rs 1.5L Assistance to Cop for Swimming Contest

200 మీటర్ల ఫ్రీస్టైల్ లో వ్యక్తిగత మరియు రిలే విభాగాల్లోనూ రజత పతకాలు సాధించాడు. ఇదేకాక, పోలీసు క్రీడల్లోనూ అనేక జాతీయ పోటీల్లో రాష్ట్ర టీంకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

నిరుడు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో జరిగిన దుర్ఘటన అనంతరంం కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసు బృందంలో భాగంగా సహయక చర్యల్లో పాల్గొన్న శ్రీనివాస్, నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+