నో: కవితకు కేంద్రమంత్రి షాక్, బీజేపీపై ఇలా(పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్‌తో తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం సమావేశమయ్యారు.
రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయిస్తే అన్ని జిల్లాలు వెనుకబడ్డాయని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ప్రస్తావించిందన్నారు.
వాటి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పని కల్పించే దిశగా ఉపాధి హామీ పథకం కింద తెలంగాణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

కేంద్రమంత్రులతో కవిత
మిషన్ కాకతీయ, జలహారం (వాటర్ గ్రిడ్) పథకాలకు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద నిధులు కేటాయించాలని కోరారు.

కేంద్రమంత్రులతో కవిత
మిషన్ కాకతీయను ఉపాధి హామీ పథకంలో చేర్చాలని కవిత విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందించారు. పథకాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకపోవడంతో ప్రస్తుతానికి అది సాధ్యం కాదని కవితకు ఝలకిచ్చారు.

కేంద్రమంత్రులతో కవిత
కవిత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోను భేటీ అయ్యారు. నిజామాబాదులో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

కేంద్రమంత్రులతో కవిత
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వంలో తెరాస భాగస్వామి అవుతుందా అని కవితను విలేకరులు ప్రశ్నిస్తే... ఆ దిశగా బీజేపీ ప్రతిపాదనలు చేస్తే ఆలోచిస్తామన్నారు.












Click it and Unblock the Notifications