నాకు రాలేదు, ఆంధ్రజ్యోతికి పోయిందేమో: కవిత, మీ ఇంటికే!: పత్రిక కౌంటర్
హైదరాబాద్: ఎన్నికల ఖర్చు విషయమై ఈసి నోటీసు పంపించిందిన్న ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పైన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు ఈసి ఎలాంటి నోటీసు ఇవ్వలేదని ఆమె చెప్పారు.
తనకైతే ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి నోటీసులు రాలేదని కవిత చెప్పారు. అది ఆంధ్రజ్యోతి చిరునామాకు పోయిందేమోనని ఎద్దేవా చేశారు. తన తప్పు ఉంటే ఈసీతో సంప్రదింపులు జరుపుతానని తెలిపారు. నోటీసు వస్తే లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పారు.

దానిపై ఆంధ్రజ్యోతి కూడా కౌంటర్ ఇచ్చింది. కవిత చిరునామా పైనే ఈసీ నోటీసు వచ్చిందని పేర్కొంది. బంజారాహిల్స్‌లోని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇంటికి ఉందని, దానిని కావాలంటే ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లో చూసుకోవచ్చునని, 16 పేజీల నివేదిక ఉందని పేర్కొంది.
నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నేరుగా బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటికే నోటీసు పంపించారని, అది కూడా గత ఏడాది జూన్ 16వ తేదీనే జారీ చేశారని, ఆయినా నోటీసుల పైన మీడియా ఎదుట బుకాయించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి కౌంటర్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications