Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖమ్మంలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్..

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ మేరకు బాధితులతో కలిసి నిరసన చేస్తున్న కవితను, ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కవిత అరెస్ట్ తో స్థానికంగా ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Kavitha Visits Velugumatla Demolition Victims in Khammam city Detained by Police During Protest

ముందస్తు నోటీసులు లేకుండా పోలీసులు కవితను, విశారదన్ మహారాజ్ సహా ఇతర ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అక్కడి నుంచి వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. వారిపై సెక్షన్ 41 CrPC కింద నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో కవిత నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్‌‌ కు చేరుకుని.. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఇదే విషయంపై తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు కవిత. మహిళా పోలీసులు లేకుండా తమను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు కవిత మాట్లాడుతూ ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. తాను టూరిస్ట్‌ గా రాలేదని, సమస్య పరిష్కారమయ్యేవరకూ పోరాడతాన‌ని వెల్ల‌డించారు. బాధితులకు కూల్చిన చోటే ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు పేదల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+