అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు (ఫోటోలు)
హైదరాబాద్: ఎర్రవల్లిలో బుధవారం నుంచి ప్రతిష్టత్మకంగా నిర్వహించే ఆయుత చండీయాగానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన అయుత చండీ మహాయాగానికి సీఎం కేసీఆర్ దంపతులు అంకురార్పణ చేశారు.
ఎర్రవల్లిలోని యాగశాలలో సోమవారం ఉదయం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం 10.55 గంటలకు గురుప్రార్థన, గణపతిపూజతో చండీయాగం కార్యక్రమాలు మొదలయ్యాయి. శృంగేరీ పీఠాధిపతి శిష్యులైన రుత్వికులు ఫణి శశాంకశర్మ, గోపీకృష్ణశర్మ, హరినాథశర్మలు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.
అమ్మవారికి యాగం చేయడానికి ముందు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఎర్రవల్లి గ్రామంలోని మైసమ్మ, పోచమ్మ దేవాలయాల్లో కేసీఆర్ దంపతులు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
ఎర్రవల్లి గ్రామ బొడ్రాయి వద్ద ఎర్రవల్లి గ్రామస్థులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. యాగశాలలో గురుప్రార్థన, గణపతిపూజా, పూణ్యాహవచనము, దేవనాందీ, అంకురార్పణము, పంచగవ్య మేళనము, ప్రాశనము, గోపూజ, యాగశాల ప్రవేశం, యాగశాల సంస్కారము, అఖండదీపారాధన, మహా సంకల్పం, సహస్ర మోదక మహాగణపతి హోమము, మహా మంగళహారతి, ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
సాయంత్రం వాస్తు రాక్షోఘ్నహోమము, అఘోరాస్త్ర హోమాలను రుత్వికులు నిర్వహించారు. అయుత మహాచండీయాగం విజయవంతం కావాలని రుత్వికులు, ఎర్రవల్లి గ్రామస్థులు కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. టీన్యూస్ ఎండీ సంతోష్‌కుమార్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
పూజా కార్యక్రమాల తరువాత కేసీఆర్ యాగశాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ వైపు నుంచి ఎర్రవల్లి చండీయాగానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై ప్రత్యేక స్వాగత ద్వారాన్ని నిర్మించారు. అక్కడి నుంచి యాగశాల వరకు వెలుగులు విరజిమ్మే విద్యుత్ లైట్లు వేశారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
సికింద్రాబాద్ నుంచి గౌరారం స్వాగత ద్వారం వరకు ప్రతి కిలోమీటరుకు ఓ చోట యాగశాలకు దారిచూపే బోర్డులను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ ప్రజల వాహనాల కోసం వేరువేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. యాగశాలకు కొద్ది దూరంలోని వెంకటాపూర్ వద్ద మూడు హెలీప్యాడ్‌లు నిర్మించారు.
అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచే వచ్చే సందర్శకుల కోసం ప్రజ్ఞాపూర్ నుంచి జగదేవ్‌పూర్ రోడ్డులోని ఎర్రవల్లికి వెళ్లే రహదారి వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. గణేశ్‌పల్లి వద్ద ఎర్రవల్లికి వెళ్లే రహదారిపై స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
అంచనాకు మించి అధికసంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశమున్నదని, ఆ మేరకు ఏర్పాట్లు ఉండాలని కేసీఆర్ ఆదేశించడంతో భోజనశాల షామియానాలను పెంచుతున్నారు. రోజు దాదాపు 50 వేల మంది ఇబ్బంది లేకుండా భోజనాలు చేసేలా ఏర్పాట్లు కల్పిస్తున్నారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
సుమారు 300 వరకు బయో మరుగుదొడ్లను యాగశాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. సందర్శకుల వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటే ఎర్రవల్లి వద్ద వాహనాలను నిలిపివేసి అక్కడి నుంచి బస్సుల ద్వారా యాగశాల వరకు సందర్శకులను తరలించేందుకు కూడా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
అయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2300 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
డీఎస్పీ, సీఐ స్థాయి క్యాడర్ పోలీసు అధికారులే 250 మందికి పైగా ఉంటారని జిల్లా ఎస్పీ సుమతి చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక పోలీసు బలగాలు ఎర్రవల్లికి చేరుకున్నాయి. రాష్ట్రపతి, గవర్నర్‌ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటీరాల వద్ద పోలీసు సెక్యూరిటీని నియమించారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
ఇతరులను యాగశాలలోపలికి అనుమతించడం లేదు. యాగశాల ముందు పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు చేయగా ఇప్పటి నుంచే లోపలికి వెళ్లి వచ్చే వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలతో పాటు పలువురు వాకీటాకీలు వినియోగిస్తున్నారు.

అంకురార్పణ: గణపతి హోమం చేసిన కేసీఆర్ దంపతులు
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ప్రత్యేక టవర్‌ను ఏర్పాటు చేయగా 23 నుంచి వైఫై సేవలు వినియోగించుకునే అవకాశమున్నట్లు అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. కాగా యాగశాల సమీప ప్రాంతంలోని చెట్లకు రంగురంగుల విద్యుత్ లైట్లు అమర్చడంతో ఆ పరిసరాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి.-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications