సమరానికి సై - కేసీఆర్ కీలక నిర్ణయం..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి విషయంలోనూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మారుతున్న లెక్కలు
తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావటంతో ఇప్పుడు కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు అధికార - విపక్ష పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేల తో కేసీఆర్ కీలక భేటీ ఏర్పాటు చేసారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం పై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

బరిలో ఒకరా .. ఇద్దరా
తాజాగా పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ లో కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగడుతామని కేసీఆర్ స్పష్టం చేసారు. కాగా 12వ తేదీ నుంచి 27వ తేదీవరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చ జరుగుతోంది. రెండు స్థానాల్లో అభ్యర్థు లను నిలబెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సంఖ్యా బలం పైన స్పష్టత వచ్చిన తరువాత ఇద్దరిని బరిలోకి దించాలా.. ఒకరినే ఖరారు చేయాలా అనేది కేసీఆర్ నిర్ణయం తీసుకోను న్నారు. ఈ సాయంత్రానికి కేసీఆర్ ఈ విషయంలో నిర్ణయం వెలువరించే అవకాశం కనిపిస్తోంది.
11న కీలక భేటీ
బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27 నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసం తంలోకి అడుగుపెట్టేవేళ సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే ఏప్రిల్ 10న బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ హైదరాబాద్ వేదికగా జరుగ నుంది. ఇక, గతంలో అసెంబ్లీ బడ్జెట్ రోజున మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఇప్పుడు సభకు కేసీఆర్ హాజరవుతానని చెబుతున్నారు. పూర్తిగా సమావేశాలకు వస్తారా.. బడ్జెట్ ప్రసంగం నాడు మాత్రమే పరిమితం అవుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాగా, 11న ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications