Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
ఈ సారి తెలంగాణలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.అంతేకాదు ఆయన కుటుంబం నుంచి కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటు లోక్‌సభ కానీ, అటు రాజ్యసభ కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ప్రాతినిథ్యం లేకపోవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
2004లో తొలిసారిగా..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలంటే తప్పనిసరిగా ఏపార్టీకైనా సరే పార్లమెంటులో ప్రాతినిథ్యం ఉండాల్సిందే. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే అది రాజ్యాంగబద్ధంగా జరగాలి.అందుకు పార్లమెంటు సరైన వేదికగా నిలుస్తుంది.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై పలుమార్లు కేసీఆర్ పార్లమెంటు బరిలోనే నిలిచి గెలిచి తన వాయిస్‌ను వినిపించారు.టీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత తొలిసారిగా 2004 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంది. నాడు కేసీఆర్ స్వయంగా పోటీ చేసి కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.ఇక మెదక్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆలె నరేంద్ర పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు.

2006,2008లో ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా
అయితే ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసిన కేసీఆర్ దేశం దృష్టి తెలంగాణపై పడేలా ఎంపీ పదవికి రాజీనామా చేసి 2006లో ఉప ఎన్నికలకు వెళ్లారు. మళ్లీ గెలుపొందిన కేసీఆర్ నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసురుతూ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని చెప్పేందుకు మరోసారి రాజీనామా చేసి 2008లో బై ఎలక్షన్‌కు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ లేదని వాదించిన కాంగ్రెస్ వాదన తప్పని రుజువు చేసేందుకు 2006 ఉపఎన్నికల్లో మళ్లీ పోటీచేసిన కేసీఆర్ 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే 2008 ఉపఎన్నికల్లో మాత్రం గెలుపు కోసం చాలా కష్టపడ్డ కేసీఆర్ కేవలం 10వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక సెంటిమెంట్ క్రమంగా కరుగుతోందని గ్రహించిన కేసీఆర్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లారు.

2009లో టీడీపీతో కేసీఆర్ పొత్తు..
2009లో టీడీపీతో జతకట్టి ఎన్నికలకు వెళ్లింది టీఆర్ఎస్. 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు.ఇక వైయస్ అకాల మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయముఖ చిత్రం మారిపోయింది. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది. తెలంగాణ ప్రజలంతా ఏకమై కేసీఆర్‌కు అండగా నిలిచారు. దీంతో 2014లో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్ ప్రవేశపెట్టింది. బిల్ పాస్ కావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తూనే ఇటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. దీంతో కేసీఆర్ మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు.

10 ఏళ్ల క్రితం చివరిసారిగా..
ఇక కేసీఆర్ కుటుంబం నుంచి చివరిసారిగా పార్లమెంటుకు 10 ఏళ్ల క్రితం గెలుపొందారు. ఒకటి కేసీఆర్ మెదక్ నుంచి గెలిస్తే..నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన కుమార్తె కవిత గెలిచారు. 2019లో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై ఓటమిపాలయ్యారు.దీంతో 2019 నుంచి పార్లమెంటులో కేసీఆర్ కుటుంబం సభ్యుల ప్రాతినిథ్యం లేదు.అయితే కేసీఆర్ అల్లుడు జోగినపల్లి సంతోష్ రావు మాత్రం రాజ్యసభ సభ్యులుగా 2018లో పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ మధ్యే ఆయన ఆరేళ్ల పదవీకాలం పూర్తయ్యింది.
20 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించకపోవడం ఇదే తొలాసారి కావడం విశేషం. ఈ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీచేయకపోవడంతో పార్లమెంటులో వీరి ప్రాతినిథ్యం ఇక ఉండదనే చెప్పుకోవాలి.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్టీని ముఖ్యనేతలు వీడుతున్న వేళ ఎన్నికల్లో పోటీచేసి ధైర్యం కల్పించాల్సిన కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండటం క్యాడర్‌కు రుచించడం లేదు. గెలిచినా ఓడుతామనే భయమా.. రిస్క్ ఎందుకని దూరంగా ఉండటమే మేలా..అనే చర్చ జరుగుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications