బీజేపీ తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని గన్ పార్క్ కు కట్టేస్తా.!తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.!
ఢిల్లీ/హైదరాబద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మైంహోం సిమెంట్ తో చంద్రశేఖర్ రావును రాజకీయ సమాధి చేసే వరకు ఉద్యమిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. జాతీయ నాయకుల సమక్షంలో తీన్మార్ మల్లన్న
బీజేపీలో చేరారు. బీజేపి తెలంగాణ వ్యవహరాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపి ధర్మపురి అరవింద్, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీన్మార్ మల్లన్నను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వంపైన, సీఎం చంద్రశేఖర్ రావుపైన తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేసారు.

మైం హోం సిమెంట్ తో కేసీఆర్ కు రాజకీయ సమాధి. తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన
బీజేపి చేరిన సందర్బంగా తీన్మార్ మల్లన్న మాట్లాడారు. తాను జర్నలిస్టు కుటుంబం నుండి వచ్చినట్టు, తీన్మార్ మల్లన్న అనే పేరును ప్రజలు పెట్టుకున్నపేరని అన్నారు. బీజేపీ ఈరోజు తనకు ఈ సభ్యత్వం అనే తాడును ఇచ్చిందని, ఈ సభ్యత్వ తాడుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేయాలనే లక్ష్యంతో బీజేపీలో చేరుతున్నట్టు సంచలన ప్రకటన చేసారు తీర్మార్ మల్లన్న. అమరవీరుల తల్లిదండ్రులతో చంద్రశేఖర్ రావు కుటుంబం వీపు పగలగొట్టించడమే తన ధ్యేయం అన్నారు చింతపండు నవీన్.

కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసకారి.. ధ్వజమెత్తిన చింతపండు నవీన్
సీఎం చంద్రశేఖర్ రావు ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని, తెలంగాణలో మీడియాను 100 కిలో మీటర్ల లోతున పాతిపెడతానని చెప్పిన అహంభావి చంద్రశేఖర్ రావు అని మండిపడ్డారు. అంతకంటే లోతున చంద్రశేఖర్ రావును పాతిపెట్టే రోజులు వస్తాయని ప్రశ్నించిన తొలిగొంతు తనదేనని, నాటి నుండి ఆ దిశగా పనిచేస్తున్నానని, అందుకే బీజేపీ ఇస్తున్న ఈ తాడుతో అమరవీరుల స్తూపానికి కట్టేసి చంద్రశేఖర్ రావు కుటుంబం వీపు పగలకొట్టిస్తానని చింతపండు నవీన్ శపధం చేసారు.

జాతీయ నేతల సమక్షంలో బీజేపి చేరిన మల్లన్న.. యుద్దం మొదలైందన్న జర్నలిస్టు
అంతే కాకుండా తనపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 38 అక్రమ కేసులు బనాయించాడని, ఐనప్పటికి చంద్రవేఖర్ రావు ఏం సాధించాడని సూటిగా ప్రశ్నించారు. తనపై కేసు పెడితే పోలీసోళ్లే బయటకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నరని, జడ్జీలు మథనపడ్డారని, కానీ చేతిలో అధికారం ఉందనే అహంకారంతో కేసులు పెట్టిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లిస్తాడని చంద్రశేఖర్ రావుకు చింతపండు నవీన్ హెచ్చరికలు జారీ చేసాడు.

ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే పంపిస్తా.. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్
చంద్రశేఖర్ రావు రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ లో పరిస్థితి ఏమైందని, చంద్రశేఖర్ రావు రాజకీయ జీవతం ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే తీసుకొస్తానని పేర్కొన్నారు. 5 ఎకరాలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రవేకర్ రావు మళ్లీ అక్కడికే తీసుకొచ్చే బాధ్యత తనదేనని తేల్చిచెప్పారు మల్లన్న. చంద్రశేఖర్ రావు బరాబర్ బాతాల పోశెట్టే అని, జర్నలిజం పీకలమీద కత్తిపెట్టాడని, ఉద్యమకారుల మెడమీద కత్తి పెట్టాడని, ఇప్పుడు వారంతా ఒక్కటవుతున్నారని తెలిపారు. మైం హోం సిమెంట్ తీసుకొచ్చి చంద్రశేఖర్ రావుకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని చింతపండు నవీన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications