Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తనిఖీ, వైద్యులను మందలించిన కేసీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం నగరంలో నల్లకుంటలో ఉన్న ఫీవర్ (సర్ రొనాల్డ్ రాస్) ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని వార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పేద ప్రజలకు సేవలందిస్తున్న ఫీవర్ ఆసుపత్రిని ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరిస్తామన్నారు.

వైద్యశాల ప్రాంగణంలోని పాత భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక వైద్యపరికరాలు సమకూర్చి మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్యశాల అవసరాలకు అనుగుణంగా మరింతమంది సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ఈ మేరకు వైద్యశాల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించి ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

దశాబ్దాలుగా నగరంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నఆసుపత్రిని అంతా కలిసి బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు. శనివారం అంబర్‌పేటలో జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం నల్లకుంట మీదుగా తిరిగి వెళుతూ ఉదయం 11 గంటల సమయంలో ఫీవర్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. సీఎంతో పాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టరు నిర్మల ఉన్నారు.

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నగరంలో నల్లకుంటలో ఉన్న ఫీవర్ (సర్ రొనాల్డ్ రాస్) ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని వార్డులను ఆయన పరిశీలించారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

ఊహించనివిధంగా ముఖ్యమంత్రి రావడంతో హాస్పిటల్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ నిర్మల తదితరులతో కలిసి వైద్యశాలకు వచ్చిన వారిలో ఉన్నారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో భవనాలు, సౌకర్యాలు తదితర అంశాలను అక్కడి అధికారులతో మాట్లాడారు. సిబ్బందితో మాట్లాడి వారి ఇబ్బందులు, జీవన పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

సూపరింటెండెంట్ ఎక్కడున్నారని వాకబు చేశారు. అయితే ఆయన శిక్షణ నిమిత్తం వెళ్లినట్లు అక్కడ ఉన్న వైద్యులు తెలిపారు. ఇన్‌చార్జి బాధ్యతలో ఎవరున్నారని అడిగిన సీఎం, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చిత్రలేఖ, ఆర్‌ఎంఓ డాక్టర్ రాజారావు అందుబాటులో లేకపోవడం గమనించారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

రెండో శనివారం కావడం వల్ల వారు రాలేదని ఉద్యోగులు చెప్పడంతో అత్యవసర శాఖలో రెండో శనివారాలు ఉంటాయా? అని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రెండో వార్డు (జ్వరాల విభాగం)కు వెళ్లి అక్కడ ఉన్న రోగులను పలకరించారు. ముందుగా గులాం హుస్సేన్ అనే రోగి దగ్గరికి వెళ్లి వైద్యం ఎలా అందుతుంది? వైద్యులు బాగా చూస్తున్నారా? అని ఆరా తీశారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

అయితే వైద్యులు బాగానే చూస్తున్నారని ఆయన సమాధానమిచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ అనే యువకుడి వివరాలు వాకబు చేశారు. తాను జ్వరంతో ముషీరాబాద్ నుంచి రెండ్రోజుల కిందట వచ్చానని చెప్పిన ప్రశాంత్, వైద్య సేవలు బాగానే అందుతున్నాయని చెప్పారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

ఆ తర్వాత పలువురు రోగులను పలకరించి సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం స్వైన్‌ఫ్లూ వార్డులోకి వెళ్లిన సీఎంకు అక్కడ రోగులు ఎవరూ కనిపించలేదు. చికిత్స తీసుకున్న తర్వాత వారందరూ డిశ్చార్జి అయి వెళ్లిపోయారని సిబ్బంది చెప్పారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

వైద్యశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందుకోసం స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పారు. అక్కడే ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, డీసీపీ రవీందర్‌ను వైద్యశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

 పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ తమ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ నిర్వహిస్తామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటు 150 మంది పోలీసులు, రెవిన్యూ సిబ్బందితో రెండ్రోజుల్లో ఈ పరిసరాలను శుభ్రం చేసుకుంటామని హామీ ఇచ్చారు.

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

పారిశుధ్యంలోపంపై వైద్యులను మందలించిన కేసీఆర్

వైద్యశాల ప్రాంగణంలో తిరుగుతున్న క్రమంలో వైద్యశాల నర్సులను గమనించి వారిని పిలిచి వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అంటూ ప్రారంభించి వారి ఆర్థికస్థోమత తదితర విషయాలు తెలుసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+