సహకరించుకుందాం: ఫడ్నవీస్‌తో కెసిఆర్(పిక్చర్స్)
ముంబై: ఇరుగు పొరుగు రాష్ర్టాలుగా పరస్పర సహకారంతో సాగు,తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు నిర్ణయించారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఇద్దరు సీఎంలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూడు సాగునీటి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సంపూర్ణ సానుకూలత ప్రకటించారు. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుకింద ముంపు ప్రాంతాన్ని తగ్గిస్తామని ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. లెండి ద్వారా 6 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు తాగు,సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అంగీకరించారు.

కెసిఆర్-ఫడ్నవీస్
ఇరుగు పొరుగు రాష్ర్టాలుగా పరస్పర సహకారంతో సాగు,తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు నిర్ణయించారు.

కెసిఆర్-ఫడ్నవీస్
ముంబైలోని రాజ్‌భవన్‌లో ఇద్దరు సీఎంలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూడు సాగునీటి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కెసిఆర్-ఫడ్నవీస్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సంపూర్ణ సానుకూలత ప్రకటించారు. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

కెసిఆర్-ఫడ్నవీస్
ఈ ప్రాజెక్టుకింద ముంపు ప్రాంతాన్ని తగ్గిస్తామని ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. లెండి ద్వారా 6 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు తాగు,సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అంగీకరించారు.

కెసిఆర్-ఫడ్నవీస్
లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని సీఎంలు నిర్ణయించారు.

కెసిఆర్-ఫడ్నవీస్
గోదావరి నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇరు రాష్ర్టాలు సమన్వయంతో పనిచేయాలని, ఆయా ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇరు రాష్ర్టాలు నిపుణులతో కూడిన కమిటీని నియమించుకోవాలని ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది.
లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని సీఎంలు నిర్ణయించారు. గోదావరి నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇరు రాష్ర్టాలు సమన్వయంతో పనిచేయాలని, ఆయా ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇరు రాష్ర్టాలు నిపుణులతో కూడిన కమిటీని నియమించుకోవాలని ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి సిద్ధంగా ఉందని, దీనికి మహారాష్ట్ర కూడా సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ ప్రాజెక్టుకు తమ అంగీకారాన్ని తెలిపారు. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఈ సందర్భంగా గడ్చిరౌలి, చంద్రాపూర్ జిల్లాల్లోని దాదాపు 30 గ్రామాల్లో 740 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని కేసీఆర్ దృష్టికి తెచ్చారు.
దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదని చెప్పారు. ముంపు ముప్పు ఎక్కువగా లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని హామీ ఇచ్చారు. ఇక లెండి ప్రాజెక్టుకు సంబంధించి 2003లో కుదిరిన అవగాహన మేరకు ఆరు టీఎంసీల గోదావరి జలాలను ఇరు రాష్ర్టాలు వినియోగించుకోవాలని ఇద్దరు
ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications