హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ దెబ్బ.. కాంగ్రెస్ చేతులు కట్టేసిన టీఆర్ఎస్: ఎన్నికలపై కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. వీరు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. వీటికి ఎన్నికలు జరుగుతున్నాయి.

టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ పార్టీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి ఒకరు పోటీలో నిలిచారు. మంగళవారం నాడు ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.

2 షరతులు: అసదుద్దీన్ ఇంట్లో కేటీఆర్‌తో సబితా భేటీ, అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై2 షరతులు: అసదుద్దీన్ ఇంట్లో కేటీఆర్‌తో సబితా భేటీ, అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై

బహిష్కరిస్తూ కీలక నిర్ణయం

బహిష్కరిస్తూ కీలక నిర్ణయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కొక్కరికి 21 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఐదు ఖాళీల కోసం ఆరుగురు పోటీలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఓ సీటును గెలుచుకోవాలి. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

నలుగురు ఎమ్మెల్యేలు తెరాసవైపు

నలుగురు ఎమ్మెల్యేలు తెరాసవైపు

గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ నుంచి, ఇద్దరు టీడీపీ నుంచి గెలిచారు. తెరాస 88 సీట్లలో గెలవగా, ఇద్దరు స్వతంత్రులు ఆ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 90కి చేరింది. అయితే, ఇటీవల పలువురు నేతలు వరుసగా తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యే (సండ్ర వెంకట వీరయ్య), నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు... చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌లు కాంగ్రెస్‌లోకి వచ్చారు... వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 19 నుంచి 15కు చేరింది. సబితా ఇంద్రా రెడ్డి వంటి వారు కూడా తెరాస వైపు చూస్తున్నారు. ఇక టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరు తెరాసలో చేరగా, మరొకరు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారా అనేది అనుమానమే. ఇలా పార్టీకి చెందిన నలుగురితో పాటు మరికొందరు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవడంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.

కేసీఆర్ వికార చర్యలు

కేసీఆర్ వికార చర్యలు

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఉన్న బలం ప్రకారం తాము ఓ సీటును గెలుచుకోవాలని, కానీ తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా కేసీఆర్ వికృత, వికార చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదం తెచ్చేలా కేసీఆర్ తీరు ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. తెరాస వ్యవహారశైలిపై అన్ని పార్టీలకు లేఖ రాస్తామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

కాంగ్రెస్ లేని మండలి కేసీఆర్ టార్గెట్

కాంగ్రెస్ లేని మండలి కేసీఆర్ టార్గెట్

అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిథ్యం లేకుండా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. ఇక మండలిలోను ఆ పార్టీకి ఏ ప్రాతనిథ్యం ఉండవద్దని భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా తెరాసలో చేరారు. ఆ తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాత్రమే మిగిలారు. వారిద్దరి పదవీకాలం ముగిసింది. అందుకే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు తమ బలంతో ఒక్క సీటు అయినా గెలుచుకుందామనుకుంటే, తెరాస ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా దెబ్బకొట్టింది.

English summary
Telangana chief minister K Chandrasekhar Rao gave shock. Congress will not contest in MLA quota MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X