నిజాంను పరుగెత్తించిన గడ్డ: అమిత్ షా, సినిమా ఉంది, ఆంధ్రా కోడలిని: పూనమ్ మహాజన్
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినం పాటించకుండా టీఆర్ఎస్ సర్కారు అమరవీరులను అవమానించిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదివారం అన్నారు. మజ్లిస్ భయంతోనే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా భారత సైనికులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో బీజేీ మహా యువభేరీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, పని చేయాల్సిన సమయం మాత్రం ఇదే అన్నారు. దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పిస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మోడీ నేతృత్వంలో పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీ విజయం కోసం కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం మారబోతుంది
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారబోతుందని చెప్పారు. 2019లో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అన్నారు. బీజేపీ గెలుపు కోసం యువమోర్చా పని చేయాలని పిలుపునిచ్చారు. నిజాంను, రజాకార్లను పరుగులు పెట్టించిన వీరభూమి హైదరాబాద్ అన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే విమోచన దినం నిర్వహిస్తామన్నారు.
రాహుల్ బాబాకు ప్రశ్నించే హక్కు లేదు
ఈ నాలుగున్నరేళ్లలో బీజేపీ ఏం చేసిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రశ్నించారని, కానీ మీరు నాలుగు తరాల్లో చేయలేనిది ఈ నాలుగున్నరేళ్లలో మోడీ చేసి చూపించారని చెప్పారు. దేశాన్ని సురక్షితం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. బీజేపీని ప్రశ్నించే అర్హత, నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో భారత్ వృద్ధి రేటు ఏమాత్రం మెరుగు లేదన్నారు. మోడీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందన్నారు. 2019లో విజయమే లక్ష్యంగా సంకల్పం చేయాలన్నారు. మోడీని మళ్లీ ప్రధానిగా చేస్తామని అందరూ సంకల్పం చేయాలన్నారు. జవాన్ల కోసం వన్ ర్యాంక్ వన్ పింఛన్ అమలు చేశామన్నారు. ఏ అంశంలో చూసినా బీజేపీని ప్రశ్నించే అర్హత రాహుల్‌కు లేదన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ విజయం కోసం శ్రమించాలన్నారు. వరుసగా కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోతోందన్నారు. రాహుల్ బాబా అంటూ విమర్శలు గుప్పించారు. ఓ వైపు మోడీ మేకిన్ ఇండియా అంటుంటే విపక్షాలు బ్రేకింగ్ ఇండియా అంటున్నాయని మండిపడ్డారు.
కూటమికి నాయకుడు లేడు
తెలంగాణలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీ కూటమికి నాయకుడే లేడని అమిత్ షా చెప్పారు. అలాంటి కూటమిని ప్రజలు నమ్మరని చెప్పారు. దేశం వికాసం, అభివృద్ధి కోసం బీజేపీ సంకల్పించిందని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌తో పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇచ్చామని చెప్పారు. దేశంలోకి అక్రమ వలసలను అడ్డుకున్నామని చెప్పారు. విపక్షాలన్నీ కలిసి మోడీ హఠావో అంటున్నాయని, మోడీ మాత్రం పేదరికం హఠావో అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ నిరుపేదలకు ఏం చేసిందని నిలదీశారు. మోడీ పాలనలో నిరుపేదలు, రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల వారికి సంకషేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు.

ఈ సభలు ట్రయల్ మాత్రమే ముందుంది సినిమా
ఈ మహాసభలు ట్రయలర్ మాత్రమేనని, అసలు పిక్చర్ ముందు ఉందని పూనమ్ మహాజన్ చెప్పారు. భారత్ స్వర్ణయుగం ప్రారంభమైందని అన్నారు. మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 2019 విజయ శంఖారావాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు. యువమోర్చాకు వచ్చిన స్పందన కంటే ఎక్కువ ఉందని, పూర్తి సినిమా ఇంకా బాకీ ఉందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 11 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలన్నారు.

మా నాన్న తెలంగాణ బిడ్డ, ఆంధ్రా కోడలిని
మా నాన్న తెలంగాణ బిడ్డ అని పూనమ్ మహాజన్ చెప్పారు. నేను ఆంధ్రా కోడలిని అన్నారు. తెలంగాణతో తన కుటుంబానికి గట్టి అనుబంధం ఉందని చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని చెప్పారు. విజయానికి సూచికే హైదరాబాదులోని మహా యువభేరీ సభ అన్నారు. కాంగ్రెస్ పాలనలో యువతకు అన్యాయం జరిగిందన్నారు. సైనికులు, రైతులు, మహిళల కోసం మోడీ శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నేతృత్వం బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకు వస్తుందని పూనమ్ మహాజన్ చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత బీజేవైఎం యువతదే అన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications