ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటుకు కెసిఆర్ ఆదేశం
హైదరాబాద్: నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో ఇటీవల జరిగిన వికారుద్దీన్ సహా ఐదుగురు ఖైదీల ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక పరిశోధక బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనిపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆయన ఆదివారం ఆదేశించారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై కొన్ని సంస్థలు, వ్యక్తులు అనుమానాలు వ్యక్తంచేయడంతో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

కాగా, ఇటీవల ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, పలువురు ముస్లిం మత పెద్దలు ఆలేరు ఎన్‌కౌంటర్ సిబిఐ విచారణ జరపాలని కోరుతూ సిఎం కెసిఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిఎం కెసిఆర్.. ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
సిమి ఉగ్రవాది, ఆలేరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వికారుద్దీన్ తండ్రి, తన కుమారుడి ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని ఇటీవల ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆలేరు ఘటనలో ఖైదీలకు ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదు కోరారు.












Click it and Unblock the Notifications