కేసీఆర్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్: వారం రోజులుగా ఇంట్లోనే ట్రీట్‌మెంట్
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటోన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నారు. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చని తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిరోజులుగా కేసీఆర్ తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతున్నారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. మున్ముందు మరిన్ని జిల్లాలను పర్యటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొనాల్సి ఉంది.

అక్టోబర్ 10వ తేదీ నాటికి ఎన్నికల నోటిఫికేషన్ సైతం వెలువడే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తోన్న నేపథ్యంలో కేసీఆర్ మున్ముందు మరింత తీరిక లేని రోజులను గడపడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో వివిధ శాఖలు, అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల మీద రోజువారీ సమీక్షలు ఎలాగూ ఉండనే ఉంటాయి.
ఈ పరిస్థితుల మధ్య కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ ఫీవర్, దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. వారం రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్నారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన స్పెషల్ టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది.
CM KCR Garu has been suffering from Viral Fever and Cough for the last one week.
— KTR (@KTRBRS) September 26, 2023
He is being treated at home by his medical team and is being monitored closely. As per Doctors he should be able to get back to normalcy in a few days
ఈ విషయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. దీనికోసం ఇంకొద్దిరోజులు పట్టొచ్చని పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్ చేసిన వెంటనే గెట్ వెల్ సూన్ అంటూ బదులు వందలాది మంది నెటిజన్లు రిప్లై ఇస్తోన్నారు.












Click it and Unblock the Notifications