పదేళ్ల కష్టం బూడిదలో పన్నీరుగా మార్చొద్దు: మోసపోవద్దంటూ కేసీఆర్ హెచ్చిరిక

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కొండగట్టు గతంలో ఎలా ఉండేదని.. ఇప్పుడు అక్కడ దివ్యధామంగా తీర్చిదిద్దుతామన్నారు. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కొండగట్టును అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కొండగట్టు అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు.

రైతు కష్టాలు తీరేలా ఒక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. ఒకప్పుడు నీటి కోసం ఎన్నో బోర్లు వేసేవాళ్లన్నారు. సాగునీటి పన్నులు రద్దు చేశామని, ధాన్యమంతా కొంటున్నామని కేసీఆర్ వివరించారు. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసుకున్నామన్నారు.

KCR hits out at Congress, bjp in BRS Praja Ashirvada Sabha held in Choppadandi

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. రైతుబంధు వృథా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భూమిపై ఎమ్మార్వోలు, తహసీల్దార్ల పెత్తనం వస్తుందని ఆరోపించారు. ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు పెరుగుతాయన్నారు కేసీఆర్. రాబోయే రోజుల్లో 24 గంటలు తాగునీరు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు రైతుల బాధలు పొయేలా ప్రణాళికలు రచించుకుని ముందుకు పోతున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి, దురదృష్టవాశాత్తు రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.ఇక్కడ వరదకాలువ, కాకతీయ కాలువ ఉన్నా ఎన్ని ఎకరాలకు నీరందేదో తెలుసా? అని ప్రజలను ప్రశ్నించారు. వరదకాలువకు మోటార్లు పెడితే అప్పట్లో ఆ మోటర్లను తీసి నీళ్లలో పారేసేవాళ్లని తెలిపారు. ఇప్పుడా ఆ బాధ ఉందా? అని అడిగారు.

కరెంట్ 3 గంటలు చాలట.. అందుకోసం 10 హెచ్​పీ మోటార్ పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని విమర్శించారు. మీకు 24 గంటలు కావాలా..? 3 గంటలు కావాలా..? ఎన్నిగంటలిచ్చే పార్టీ గెలవాలో మీరే నిర్ణయించాలన్నారు కేసీఆర్. ప్రజలు మోసపోతే పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కేసీఆర్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+