Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘కాళేశ్వరం’పై కాంగ్రెస్ పాలకులకు కేసీఆర్ వార్నింగ్: కోమటిరెడ్డి సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) డిజైన్లపై కాంగ్రెస్ పాలకులకు కనీస పరిజ్ఞానం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. పొలం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం చేనేత కార్మికులు, విద్యుత్‌, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

చేనేత కార్మికులకు పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కేసీఆర్‌ అన్నారు. చేనేత కార్మికులను ఆదుకోకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందని హెచ్చరించారు. ఈ రంగం కార్మికులకు 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి మళ్లీ వచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌(BRS) కంటే 1.80 శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌కు ఎక్కువగా వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు విని ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు.

KCR hits out at congress for Kaleshwaram Project issue komatireddy venkat reddy counter to brs president

గత వేసవిలో 14,500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా జరిగిందని, ఈ వేసవిలో 15,200 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా జరిగిందని కేసీఆర్‌ తెలిపారు. ఈ వేసవిలో గతేడాది కంటే 700 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే అదనంగా వచ్చిందన్నారు. ఈ ఏడాది ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు అదనంగా 1400 మెగావాట్లు లభ్యత పెరిగిందని కేసీఆర్ వివరించారు. 1400 మెగావాట్లు లభ్యత పెరిగితే 700 మెగావాట్లు మాత్రమే అదనంగా సరఫరా చేశారని దుయ్యబట్టారు. మరోవైపు, రైతుబంధు వేయకపోవటం వల్ల రైతులు మళ్లీ అప్పుల పాలయ్యారని ఆవేదన చెందారు.

కాంగ్రెస్ పాలకులకు కనీస పరిజ్ఞానం లేదు

కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొందని మండిపడ్డారు కేసీఆర్. మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బ్యారేజీ నిర్మించామని, వీటిలో 3 కుంగిపోతే మొత్తం కుంగిపోయినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ఆరాటపడ్డాం, ఆరు నెలలు తపస్సు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశామని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై కాంగ్రెస్‌ పాలకులకు కనీస పరిజ్ఞానం లేదని, గోదావరి నుంచి నీళ్లు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజీతో పని లేదన్నారు. వరద 25000 క్యూసెక్కుల కంటే తగ్గితేనే మేడిగడ్డ అవసరమన్నారు. ఇసుక బస్తాలు అడ్డుపెట్టి కూడా నీటిని ఎత్తిపోయొచ్చన్నారు. బ్యారేజీల నిర్మాణంలో చిన్నచిన్న పొరపాట్లు జరగటం సహజమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే.. తామే 50 వేల మంది రైతులతో వెళ్లి ప్రాజెక్టులు నీటితో నింపుతామని చెప్పారు.

నేడు అడ్డం పొడుగు మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిడ్ మానేరు ప్రాజెక్టు కట్టారని బయటపెట్టారు. వాళ్ల అమ్మ పేరు మీద ఉన్న కంపెనీనే దాన్ని కట్టిందని తెలిపారు. 'ఆగమేఘాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్‌ కావాలి. రైతులకు నీళ్లు రావాలి. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. సాగునీటి బాధ పోవాలి.. తాగు నీటి బాధ పోవాలి అని ఆరాటపడ్డాం తప్ప కోమటిరెడ్డి కంపెనీ మీద కేసులు పెట్టలేదు' అని తెలిపారు. మీ లెక్క చిల్లర కథలు పడాలంటే కేసులు పెట్టి.. వాళ్లను జైలుకు పంపకపోదుమా అని ప్రశ్నించారు. అయినా వారిని వదిలిపెట్టి ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి నదిలో, రిజర్వాయర్లలో ఎప్పుడూ నీరు ఉండేలా చేశామన్నారు కేసీఆర్.

కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఓ వైపు అధికారం కోల్పోవడం, మరోవైపు కవిత జైలుకు పోయిందని.. బాధ, ఫ్రస్టేషన్‌లో కేసీఆర్ మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలని, ఆయన జైలుకు పోవడం ఖాయమని అన్నారు. అంతేగాక, కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జనాలకు పంచుతామని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెనుకున్న పెద్దలను కూడా పట్టుకుంటామన్నారు.

కాళేశ్వరం అవినీతిపై కేబినెట్ తీర్మానం చేసి సీబీఐ విచారణ కోరతామని, అవినీతిపై లెక్క తేల్చుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి. లక్ష అబద్ధాలు ఆడి కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించారని ఆరోపించారు. కుక్కలు, నక్కలు అని తమకు కూడా తిట్టొచ్చని బదులిచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి అడిగితే.. తనను అసెంబ్లీ నుంచి బయటకు పంపారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. తాను తప్పు చేస్తే జైలుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. తనకు ఎలాంటి కంపెనీ లేదన్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మించి.. ఇప్పుడు కేసీఆర్ అవాస్తవాలతో ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+