జూబ్లీహిల్స్ లో కేసీఆర్ కొత్త ఫార్ములా, సర్వే రిపోర్ట్స్- మారుతున్న లెక్కలు..!!

తెలంగాణ రాజకీయం ఇప్పుడు జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావటంతో ఇక.. ప్రచారం, గెలుపు పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. పెద్ద సంఖ్యలో దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక..మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లో గెలుపు పైన కొత్త ఫార్ములా సిద్దం చేసారు. పార్టీ ముఖ్యులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ ను సైతం ప్రచారం చేయాలని పార్టీ నేతలు కోరారు. కాంగ్రెస్ అనుకూల.. వ్యతిరేక అంశాలపై ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో కేసీఆర్ నిర్దేశించారు.

జూబ్లీహిల్స్ లో గెలుపు ఇప్పుడు తెలంగాణలోని మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. కాగా,
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. పార్టీ ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇంచార్జ్‌లకు కేసీఆర్‌ రేపు (గురువారం) ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ముందే కేటీఆర్, హరీష్ తో సహా పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

KCR implementing new strategies for winning in Jubilee hills details here

అందు లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలాలు.. బలహీనతల పైన కేసీర్ ప్రత్యేకగా చర్చించారు. స్థానిక అంశాలు.. ఎంఐఎం- కాంగ్రెస్ దోస్తీ అంశాలను కీలకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఓటింగ్ పైన కేసీఆర్ చర్చిచినట్లు సమాచారం. నియోజవకర్గంలో సామాజిక సమీకరణాల పైన చర్చించిన కేసీఆర్.. ఈ మేరకు పార్టీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేసారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉందనే సర్వే నివేదికలతో కేసీఆర్ కొత్త ఫార్ములా సూచించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ - హరీష్ ఏ ప్రాంతాల బాధ్యతలు తీసుకోవాలనే అంశం పైన క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కేసీఆర్ ను ప్రచారంలోకి రావాలని పార్టీ నేతలు కోరినట్లు తెలుస్తోంది. ప్రచారం చివరి మూడు రోజుల సమయంలో నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ చెప్పారని సమాచారం. ఇక.. బీఆర్ఎస్ ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది.

సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొంది స్తున్నారు. కాంగ్రెస్ ఎంఐఎం సహకారంతో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, కాంగ్రెస్ కు ఓటింగ్ వర్గాలు.. ప్రాంతాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ నేతల సమాచారం. అదే విధంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేయాలని సూచించారు. రేపు జరిగే భేటీలో సర్వేల వివరాలను కేసీఆర్ వెల్లడించి.. అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+