వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్‌లకు కూడా లేవు: కెసిఆర్‌ను ఓ డబుల్ బెడ్‌రూం అడిగిన గవర్నర్! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఢిల్లీలోని ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా ఇలాంటి ఇళ్లు లేవని గవర్నర్ నరసింహన్ తనతో చెప్పారని, పేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను చూసి ఆయన ప్రశంసించారని, రాష్ట్రంలో గవర్నర్‌కు కూడా ఈ తరహా ఇల్లు ఒకటి కేటాయించాలని ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేశారని సీఎం కెసిఆర్ అన్నారు.

సికింద్రాబాదులోని ఐడీఎచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కార్యక్రమాన్ని కెసిఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లను సీఎం సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం కెసిఆర్ మాట్లాడారు. ఐడీహెచ్ కాలనీతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని, అనుకున్న ప్రకారంగా ఇండ్లను నిర్మించుకున్నామని, పాలు పొంగించామన్నారు. ఇక అందరూ సంతోషంగా ఉండాలన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

గత ఏడాది దసరా పండుగ నాడు ఇండ్లకు శంకుస్థాపన చేసుకున్నామని, ఈ దసరా పండుగకు ఇవ్వడానికి రెడీ అయ్యాయని, కానీ గుంటూరులో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కారణంగా మరో రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుందామని మంత్రి తలసానికి చెప్పానన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

దీపావళి తర్వాత ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో పేదల ఇండ్లు అంటే ఊరవతల ఉండేవని, ఇరుకుగా ఉండేవని, డబుల్ బెడ్‌రూం ఇళ్లతో ఇబ్బందులు ఉండవన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

పేదలంతా ఆత్మగౌరవంతో బతకాలన్నారు. అందుకే ఈ సంవత్సరం రాష్ట్రంలో 60 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. 119 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 400 చొప్పున నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడత రూ.4 వేల కోట్లతో ఇండ్లు నిర్మించుకుంటున్నామన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

ఇంతకాలం డబుల్ బెడ్‌రూం ఇళ్లు అంటే ఎలా కట్టాలనే విషయంలో అధికారుల్లో స్పష్టత ఉండేది కాదని, కలెక్టర్లను ఐడీహెచ్ కాలనీ చూడమని చెప్పానని కేసీఆర్ అన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

దానితో వారికి స్పష్టత వచ్చిందని, ఈ కాలనీయే రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణాలకు రోల్ మాడల్‌గా ఉంటుందన్నారు. ఈ కాలనీని ఎందరెందరో సందర్శించి మెచ్చుకున్నారని, ప్రత్యేకంగా రాష్ట్ర గవర్నర్ ఎలా ఉందో చూద్దామని వచ్చారని, కాలనీని చూసిన తర్వాత ఇక్కడినుంచే గవర్నర్ తనకు ఫోన్ చేసి ఇండ్లు బాగున్నాయని చెప్పారన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్లలాగా బాగున్నాయ్... నాక్కూడ ఒకటి మంజూరు చెయ్యి అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

వరంగల్‌లో ఓ బహిరంగ సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర ప్రభుత్వం ఒక గది ఇళ్లను మంజూరు చేస్తే తెలంగాణ సీఎం డబుల్ బెడ్‌రూంలు కట్టించి ఇస్తున్నరని చెప్పి మెచ్చుకున్నారన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

ఇంతకాలం ప్రభుత్వం చెప్పింది చేస్తుందా లేదా అనే అనుమానాలు ఉండేవని ఇవాళ వాటిని పటాపంచలు చేశామని కెసిఆర్ అన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

అందరికీ ఇళ్లు లక్ష్యంగా పెట్టుకుని, పేదలందరూ గౌరవప్రదంగా జీవించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఇళ్లలోకి పోయిన పేదలు బ్రహ్మాండంగా దావత్ ఇచ్చారని, సంతోషంగా ఉందన్నారు. మీ అందరితో కలిసి తినడం మరిచిపోలేనన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

కాలనీలోని ప్రతీ తల్లికి, తండ్రికి శుభం కలుగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... ఐడీహెచ్ కాలనీ వాసులు ఇవాళ నిజమైన దీపావళి పండుగ జరుపుకుంటున్నారన్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

అనుకున్న సమయంలో డబుల్ బెడ్‌రూం నిర్మాణాలను పూర్తి చేసి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. కేంద్రం 2020 విజన్‌తో అందరికీ ఇండ్లు కార్యక్రమం కింద రూ.1,632 కోట్లతో 83,678 ఇండ్లను నిర్మిస్తున్నారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

తెలంగాణకు రూ.908 కోట్లు రావాల్సి ఉండగా అదనంగా రూ.960 కోట్లు విడుదల చేసిందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రెండు పడకల గది

రెండు పడకల గది

స్లమ్ ఫ్రీ సిటీ పథకానికి రాష్ట్రంలో నాలుగు నగరాలను ఎంపిక చేశామని, వీటిలో హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, రామగుండం ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున ఐడీహెచ్ కాలనీ లాంటి డబుల్ బెడ్‌రూం నిర్మాణాలు చేయాలని సీఎం తలపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.

గవర్నర్‌తో కెసిఆర్

గవర్నర్‌తో కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌కు కలిశారు. పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం

గవర్నర్‌తో కెసిఆర్

గవర్నర్‌తో కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌కు కలిశారు. ఇరువురు మాట్లాడుకుంటున్న దృశ్యం.

గవర్నర్‌తో కెసిఆర్

గవర్నర్‌తో కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌కు కలిశారు. ఇరువురు మాట్లాడుకుంటున్న దృశ్యం.

English summary
The state government will only construct double bedroom flats for people living Below Poverty Line (BPL) in the state, chief minister K Chandrasekhar Rao has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X