మళ్లీ కేసీఆర్ యాగం: గెలుపు కోసం రాజ్యశ్యామల యాగం, ప్రజల కోసం చండీసహిత రుద్ర హోమం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల పాటు ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‍లో చండీహోమం నిర్వహిస్తున్నారు. ఆదివారం, సోమవారం ఈ హోమం నిర్వహిస్తున్నారు. రాజ్యశ్యామల హోమం, మహారుద్ర సహిత చండీయాగం నిర్వహిస్తున్నారు.

అందుకే కేసీఆర్ యాగం
వీటిని ప్రజా సంక్షేమం, రాజయోగం కోసం కేసీఆర్ నిర్వహిస్తున్నారు. 120 మంది రుత్విక్కుల ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. ఈ హోమంలో ఆదివారం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యసహిత చండీహోమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొనగా, చండీసహిత రుద్రహోమంలో కేసీఆర్ మద్దతుదారులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

గతంలోను యాగం
2015లో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద అయుత చండీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మళ్లీ యాగం నిర్వహిస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి సిద్దిపేట జిల్లాలో ఉంది. ఆదివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో రుత్విక్కులతో ఈ హోమం ప్రారంభమైంది. క్యామసిద్ధి కోసం జరిపే హోమంతో పాటు నవగ్రహ పాశుపతం, సూర్యనమస్కారాలు, రుద్రక్రమార్చన, రుద్రాభిషేకం, రుద్రహోమం కూడా జరిపిస్తారు. ఇటీవల విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ సన్నిహుతులు ఆయనను కలిశారు. రాజశ్యామల హోమం జరిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సమ్మతించారు. ఆయన శనివారమే పాంహౌస్ చేరుకున్నారు.

19 నుంచి జోరుగా ప్రచారం
కేసీఆర్ ఈ నెల 19వ తేదీ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఆయన వరుసగా బిజీగా ప్రచారంలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమం కోసం ముందే యాగం నిర్వహించి, ఆ తర్వాత ప్రచారం ప్రారంభిస్తారు.

వరుసగా ప్రచారం
షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఈ నెల 19న (సోమవారం) ఖమ్మం, పాలకుర్తిలో, 20న సిద్దిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలలో, 21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్‌లలో, 22న ఖానాపూర్, ఇచ్చోడ (బోధ్, నిర్మల్, ముథోల్, ఆర్మూర్‌లలో, 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామలలో, 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో ప్రచార సభల్లో పాల్గొంటారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications