వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ నాకు మంచి మిత్రుడే ..కాని, :కోదండరామ్ ఇంటర్వ్యూ

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు తనకు మధ్య ఎలాంటి అగాధం లేదంటున్నారు జెఎసిచైర్మెన్ కోదండరా మ్. కెసిఆర్ తనకు సన్నిహిత మిత్రుడే అని ఆయన చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్ :తెలంగాణ ఉద్యమ నిర్మాణ సమయంలో జెఎసి చైర్మెన్ కోదండరామ్ కు, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు మధ్య ఉన్న సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి. వీరిద్దరి మద్య అగాధం పెరిగింది.ప్రభుత్వ వ్యవహరశైలిని కోదండరామ్ ప్రశ్నిస్తున్నారు.అయితే టిఆర్ఎస్ మాత్రం కోదండరామ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలను ఎక్కు పెడుతోంది.

ఉద్యమ సమయంలో వీరిద్దరి మద్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని కోదండరామ్ ఖండిస్తున్నారు. కెసిఆర్ కు తమకు మద్య ఎలాంటి విబేధాలు లేవని చెబుతున్నారు కోదండరామ్.

కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ సన్నిహితంగా మెలుగుతున్నారని టిఆర్ ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.అయితే ఈ విమర్శలను కోదండరామ్ కొట్టిపారేస్తున్నారు.తమ నిర్ణయాల్లో ఎవరి ప్రమేయం లేదంటున్నారు.మరో వైపు రాజకీయపార్టీ ఏర్పాటు విషయంలో వ్యక్తీకరణ చేసే సందర్భం వచ్చిన ప్పుడు రాజకీయపార్టీ ఏర్పాటు విషయాన్ని ఆలోచిస్తామని కోదండరామ్ ప్రకటిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందా ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందా ?

ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనితీరు ఉందా?

కోదండరామ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, అయితే ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించిప్రజలకు నీటిని సాగునీటిని అందించే ప్రయత్నం ప్రారంభించింది.అయితే ఈ విషయం మినహ ఇతర విషయాల్లో ఆశించిన ప్రగతి సాధించాల్సిన అవసరం మాత్రం ఉంది.నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం అడుగులు ప్రారంభించడం అభినందించదగిందే.కాని, ఉద్యమ సమయంలో ఏ రకంగా తెలంగాణ ఉండాలని భావించామో , ఆ దిశగా ప్రభుత్వ అడుగులు వేయడం లేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో వచ్చింది. కాని, ఉద్యోగుల కల్పన విషయాల్లో అడుగులు పడలేదన్నారు కోదండరామ్.

ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమీషన్ తో పాటు ఇతర మార్గాల ద్వారా కూడ ప్రయత్నాలు ప్రారంభించింది కదా?

ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమీషన్ తో పాటు ఇతర మార్గాల ద్వారా కూడ ప్రయత్నాలు ప్రారంభించింది కదా?

ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయి?

కోదండరామ్. ఉద్యోగాల , ఉపాధికల్పనలో ప్రభుత్వ వ్యవహరశైలి సక్రమంగా లేదు.ఈ విషయంలో ప్రభుత్వం సక్రమంగా ప్రణాళికలను అమలు చేయడం లేదన్నారు.ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు.వ్యవసాయ రంగంలో సన్న, చిన్న కారు రైతులకు ఉపాధి కల్పన అనేది కరువైందన్నారు కోదండరామ్.ఆదాయ మార్గాలను పెంపొందించే దిశగా చర్యలను తీసుకోవడం లేు. సరళీకరణ విధానాలతో కునారిల్లిన వర్గాలను పునరుజ్జీవం చేసేందుకు ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడం ప్రధాన లోపంగా కన్పిస్తోంది.

నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకుగాను ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ?

నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకుగాను ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ?

ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు?

చిన్న, మధ్య తరహ పరిశ్రమలను ప్రోత్సహించాలి, వ్యవసాయరంగంలో కూడ అవసరమైన మార్పులను తీసుకొని రావడం ద్వారా ఉపాధి మార్గాలను మరింత పెంచే అవకాశాలుంటాయి.తెలంగాణ వచ్చినా నిరుద్యోగ సమస్య రూపుమాపకపోవడం ప్రధాన లోపంగా మారింది. ఈ సమస్యను అధిగమించకపోతే తెలంగాణ ప్రజలకే తీవ్ర నష్టం.

కవులు , కళాకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదనడాన్ని సమర్థిస్తారా , వ్యతిరేకిస్తారా ?

కవులు , కళాకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదనడాన్ని సమర్థిస్తారా , వ్యతిరేకిస్తారా ?

కళాకారులు ప్రభుత్వానికి వ్యతిరేకింగా మాట్లాడడం సరైంది కాదనడాన్ని ఎలా చూస్తారు?

తెలంగాణ సాధనతోనే సమస్య పరిష్కారం కాలేదు. ఏ లక్ష్యం కోసం రాష్ట్రాన్ని సాధించుకొన్నామో, ఆ దిశగా ప్రభుత్వం సాగేలా కవులు, కళాకారులు పనిచేయాల్సిన అవసరం మాత్రం ఉంది.

ఉద్యమ పార్టీగా, రాజకీయపార్టీగా టిఆర్ ఎస్ కు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఉద్యమ పార్టీకి, రాజకీయ పార్టీకి మద్య తేడాలుంటాయా?

ఉద్యమ పార్టీగా, రాజకీయపార్టీగా టిఆర్ ఎస్ కు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఉద్యమ పార్టీకి, రాజకీయ పార్టీకి మద్య తేడాలుంటాయా?

ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ లు అని వేర్వేరు ఉండనే ఉండవు.రాజకీయపార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయనేది ప్రధానమైంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీలు పనిచేస్తున్నాయా, ఇతర మార్గాల వైపుగా పార్టీలు పయనిస్తున్నాయా అనేది చూడాల్సిన అవసరం ఉంది.ప్రజలతో మంచి సంబందాలు పార్టీలకు ఉన్నాయా లేదా అనేది ముఖ్యమన్నారు.ఉద్యమ సమయంలో ప్రజలతో ఏ రకమైన సంబంధాలున్నాయో అదే రకమైన సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత టిఆర్ఎస్ పై ఉంది.

ఉద్యమ సమయంలో ఓ రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా వ్యవహరించడాన్ని ఎలాచూస్తారు?

ఉద్యమ సమయంలో ఓ రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా వ్యవహరించడాన్ని ఎలాచూస్తారు?

అధికారంలోకి రాకముందు, వచ్చాక మాటలు మార్చడాన్ని ఎలా చూస్తారు?

ఉద్యమ సమయంలో ఏం మాట్లాడమో, అధికారంలో ఉన్నప్పుడు వాటిని మర్చిపోయాం, వాటి గురించి పట్టించుకోకపోవడం అనేది సరైంది కాదు, ఉద్యమం కోసం ఇలా మాట్లాడం , అధికారంలోకి వచ్చాక ఇది అవసరం లేదనుకోవడం అప్రజాస్వామికం.ఈ పద్దతులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ ఒక్కటే కాదు. ఏ రాజకీయ పార్టీకైనా ఇది వర్తిస్తోంది.

కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని అధికారపార్టీ ఆరోపణలుచేస్తోంది?

కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని అధికారపార్టీ ఆరోపణలుచేస్తోంది?

కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఏం చెప్పారు?

జెఎసిగా తమకు అన్ని వర్గాలు, ప్రజలు, గ్రూపులు, పార్టీలతో సత్సంబంధాలు ఉంటాయి. ఉండాల్సిన అవసరం కూడ ఉంది.వీరందరితో సంబంధాలు ఉన్నప్పుడు కూడ తమ నిర్ణయాలను తామే తీసుకొంటున్నామని ఆయన చెప్పారు. కొన్ని పార్టీల మాదిరిగానే నాయకుడే నిర్ణయం తీసుకొని అమలు చేసే పరిస్థితి జెఎసికి లేదన్నారు. ప్రతి అంశాన్ని సమావేశం ఏర్పాటుచేసుకొని చర్చించుకొని నిర్ణయం తీసుకొంటామన్నారు. కాంగ్రెస్ కాని, ఇతర పార్టీలు కాని తమ అభిప్రాయాలను ప్రభావితం చేయబోవని ఆయన ప్రకటించారు.ఎవరో రాసిచ్చిన దాన్ని కూడ తమ నిర్ణయాలుగా ప్రకటించడం లేదన్నారు కోదండరామ్.

మీ నిర్ణయాలు, మీ కార్యక్రమాల వెనుకపార్టీలు, వ్యక్తుల పాత్ర ఉందని అధికార పార్టీనాయకుల ఆరోపణల్లో వాస్తవం ఎంత?

మీ నిర్ణయాలు, మీ కార్యక్రమాల వెనుకపార్టీలు, వ్యక్తుల పాత్ర ఉందని అధికార పార్టీనాయకుల ఆరోపణల్లో వాస్తవం ఎంత?

మీ నిర్ణయాల వెనుక కొందరి పాత్ర ఉందనే ఆరోపణలపై మీరెలా చూస్తారు?

తెలంగాణ ప్రజల కేంద్రంగా తమ కార్యక్రమాలుంటాయి.సమాజ పురోభివద్ది కోసం పనిచేస్తాం. ఈ లక్ష్య సాధన కోసం పనిచేస్తాం.ఈ మేరకు కలిసివచ్చేవారితో కలిసివెళ్తాం.కాంగ్రెస్ పార్టీతో కాని, ఇతర పార్టీలతో కాని , తమకు రహస్య ఒప్పందాలు లేవు.అది మా విధానం కానేకాదు. చాటుమాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను మేం కలవం.

తెలంగాణ రాజకీయపార్టీల పనితీరు ఎలా ఉంది బంగారుతెలంగాణ కోసం సాగుతున్న రాజకీయ పునరేకీకరణ ను ఎలా చూస్తారు?

తెలంగాణ రాజకీయపార్టీల పనితీరు ఎలా ఉంది బంగారుతెలంగాణ కోసం సాగుతున్న రాజకీయ పునరేకీకరణ ను ఎలా చూస్తారు?

రాజకీయ పునరేకీకరణను ఎలా చూస్తారు?

రాజకీయాల్లో విలువుల ముఖ్యమైనవి . ఏనాడు ప్రజల అవసరాలు,సమస్యలను తీర్చనివాడు ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చుపెట్టి విజయం సాధించడం, ఎంఏల్ఏ, ఎంపిగా విజయం సాధించాక అధికార పార్టీలోకి ఫిరాయించడం సరైందికాదన్నారు.విలువలు అనేది ముఖ్యమన్నారు.విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉంది.

రాజకీయాల్లో విలువలను పెంపొందించేందుకు ఏం చేయాలి?

రాజకీయాల్లో విలువలను పెంపొందించేందుకు ఏం చేయాలి?

విలువల పెంపొందించేందుకుగాను ఏం చేయాల్సి ఉంది?

రాజకీయాల్లో విలువలను పెంపోందించేందుకుగాను ప్రజలనుచైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తాము ఈ పనిని చేస్తున్నాం. ఎన్నికలకు ఎన్నికలకు ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని అంబేద్కర్ చెప్పారు. ఈ దిశగానే మా కృషి ఉంటుంది. ప్రజలు ఎంత చైతన్యవంతులైతే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది.చదువుకొన్నవారు మౌనంగా ఉండడం కూడ నేరమేనని ఫ్రోఫెసర్ జయశంకర్ తరచూ అనేవాడని ఆయన గుర్తుచేసుకొన్నాడు.

జెఎసి చైర్మెన్ గా కోదండరామ్ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది వాస్తవమేనా?

జెఎసి చైర్మెన్ గా కోదండరామ్ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది వాస్తవమేనా?

రాజకీయపార్టీ ఏర్పాటు ప్రచారంలో వాస్తవం ఉందా?

రాజకీయాలంటే ఆసక్తి ఉంది.పార్టీల్లో విలువల పెంపొందించే దిశగా ఆలోచనలుచేస్తున్నాం.అయితే ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం.ఉద్యమ పంథాలోనే ముందుకు వెళతాం. కాని,భవిష్యత్తులో ఏ రకంగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించాల్సి ఉందో చూడాలి. వ్యక్తీకరణ చేసే సందర్భం వస్తే ఏ రకంగా వ్యవహరించాలో ఆలోచిస్తాం అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయాన్ని ప్రకటించే పరిస్థితి మాత్రం లేదు. వ్యక్తీకరణ చేసే సందర్బం రావాలి.ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటాం.

తెలంగాణ వచ్చిన ఆంద్ర వారి పెత్తనం సాగుతోందా?

తెలంగాణ వచ్చిన ఆంద్ర వారి పెత్తనం సాగుతోందా?

ఆంద్రా పెత్తనం ఇంకా కొనసాగుతోందా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఆంద్ర ఆదిపత్యం సాగుతోందన్నారు కోదండరామ్.ఆంద్రపాలన పోయింది.కాని వారి గుత్తాధిపత్యం పోలేదన్నారు.ఆంద్ర, కార్పోరేట్ శక్తులకు తెలంగాణలో మేలు జరుగుతోందనిఆయన అభిప్రాయపడ్డారు.కాంట్రాక్టుల కోసం ఎంఏల్ఏలు, ప్రజా ప్రతినిధులు పార్టీలు మారుతున్నారని ఆయన చెప్పారు.ఆంద్రవారికి మేలు జరుగుతోంది.తెలంగాణ ప్రజల ఆకాంక్షలుసాధించే దిశగా రాజకీయాలు ఉండాలి.పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పెద్ద పెద్ద కాంట్రాకర్లంతా ఆంద్రాకు చెందినవారే. అయితే కాంట్రాక్టును ముక్కలు ముక్కలుగా చేస్తే తెలంగాణ కాంట్రాక్టర్లకు కూడ ఉపయోగపడతాయి. కాని, ప్రభుత్వం అలా పనిచేయడం లేదు.

రాజకీయపార్టీలు ప్రజల గురించి, విలువల గురించి ఆలోచించేందుకు ఏంచేస్తారు?

రాజకీయపార్టీలు ప్రజల గురించి, విలువల గురించి ఆలోచించేందుకు ఏంచేస్తారు?

ప్రజల కోసం పార్టీలు పనిచేసేలా ఏం చేయబోతున్నారు?

ప్రజాస్వామ్యయుతంగా రాజకీయపార్టీలు వ్యవహరించాలి. ప్రజల సంక్షేమం దిశగా పార్టీలు పాటుపడాలి.ఈ ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు.నిజాం వ్యతిరేక పోరాటం సాగింది.ఆంద్రపాలన సాగింది.అయితే తెలంగాణ ప్రజల సంక్షేమం దిశగా పార్టీలు ఆలోచించాలి.ఈ మేరకు తమ కార్యాచరణ ఉంటుంది.రాజకీయపార్టీల్లో విలువల కోసం పనిచేస్తామని ఆయన ప్రకటించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల మీ వైఖరి ఎలా ఉంది, ఆయనకు మీకు మద్య అగాధం పెరిగినట్టుగా కన్పిస్తోంది?

ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల మీ వైఖరి ఎలా ఉంది, ఆయనకు మీకు మద్య అగాధం పెరిగినట్టుగా కన్పిస్తోంది?

కెసిఆర్ కు మీకు మధ్య అగాధం పెరిగిందా?

ముఖ్యమంత్రి కెసిఆర్ నాకు సన్నిహితుడు. ఉద్యమంలో ఇద్దరం కలిసి పనిచేశాం.ఆయనపై నాకుకోపం లేదు. ఘర్షణ కూడ లేదు. ఆయనతో ఘర్షణ పడాల్సిన అవసరం మాత్రం లేదు.అయితే ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాటం చేసినట్టుగానే ప్రస్తుతం కూడ పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అధికారంలో ఉన్నందున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండదంటే సరైందికాదు.ప్రజల పక్షాన వారి గొంతుకను వినిపించేందుకు జెఎసి పనిచేస్తోంది. కాని, ప్రభుత్వంలో టిఆర్ఎస్ ఉందని మాత్రం మౌనంగా ఉండలేం.ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకోవడం తప్పనుకొంటే అది వారి బలహీనత. ప్రశ్నించకుండా మౌనంగా ఉంటే అది మా బలహీనత .అయితే ఆంద్రవారికి సహయం చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదు. కాని, తెలంగాణకు నష్టం కల్గించేలా ఆంద్రకు ప్రయోజనం కల్గించడాన్ని వ్యతిరేకిస్తాం.

ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేసినవారికి ప్రయోజనం కలుగుతోందా?

ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేసినవారికి ప్రయోజనం కలుగుతోందా?

ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలకు ప్రయోజనం సాగుతోందా?

ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలకు , ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది.కాని,ప్రభుత్వ తీరును చూస్తే ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేసినవారికి అనుకూలంగా వ్యవహరిస్తోంది.ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సర్కార్ నడుస్తోంది. దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది.

ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవారు క్యాబినెట్ లో ఉండడాన్ని ఎలా చూస్తారు?

ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవారు క్యాబినెట్ లో ఉండడాన్ని ఎలా చూస్తారు?

ఉద్యమాన్ని వ్యతిరేకించినవారు క్యాబినెట్ లో ఉండడంపై అభిప్రాయం ఏమిటి

ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవారు క్యాబినెట్ లో ఉండడమంటే రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన వారిని పరిహసించడమే. ప్రాణ త్యాగం చేసిన అమరులను విస్మరించినట్టుగానే ఈ పరిస్థితి దాపురించింది.రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల వారిని టిఆర్ఎస్ లో చేర్చుకోవడం సరైందికానేకాదు.

English summary
Kcr is my close friend says kodandaram,we are intrest in politics he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X