Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ సంస్కార హీనుడు.!కేటీఆర్ విజ్ఞత కోల్పోయాడు.!మరోసారి మండిపడ్డ ఈటల రాజేందర్.!

మునుగోడు/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని, మంత్రి కేటీఆర్ ఉన్నత చదువులు చదువుకున్నప్పటికి విజ్ఞత కోల్పోయి వ్యవహరిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.కేటీఆర్ అలాంటి భాష వాడడం బాధాకరమని, తండ్రి బాటలో నడుస్తున్నాడని ఎద్దేవా చేసారు. కుటుంబ పాలన మీద సమాధానం చెప్పలేక చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఈటల విరుచుకుపడ్డారు. రాజగోపాల్ రెడ్డి టీఆరెఎస్ పుట్టకముందే కాంట్రాక్టర్ అనే విషయాన్ని సీఎం, ఆయన తనయుడు కేటీఆర్ మర్చిపోయారని ఈటల రాజేందర్ తెలిపారు.

రాజగోపాల్ సవాల్ కు సీఎం సిద్దమా.?మరోసారి సీఎంపై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

రాజగోపాల్ సవాల్ కు సీఎం సిద్దమా.?మరోసారి సీఎంపై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

అంతే కాకుండా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు చేస్తున్నారని, ఇప్పుడు 18 వేల కోట్ల కాంట్రాక్ట్ అంటూ సీఎం ఆయన కుమారుడు ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణలో కూడా అలాగే కాంట్రాక్టులను అప్పగిస్తున్నారా?అని ఈటల ప్రశ్నించారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చ కామెర్లు అన్నట్టు వారు చేసే పనులు అందరూ చేస్తున్నారా? అని ముఖ్యమంత్రిని నిలదీసారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ వచ్చిందని, ఈ అంశంపై యాదగిరిగుట్ట టెంపుల్ కి తడి బట్టలతో వస్తా దమ్ముంటే రావాలని సీఎంకు రాజగోపాల్ రెడ్డి సవాలు విసిరిని మర్చిపోవద్దన్నారు ఈటల.చిత్తశుద్ది ఉంటే ఆ సవాలు స్వీకరించాలని, చంద్రశేఖర్ రావు కు ఏమీ లేనప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం సాయం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఈటల స్పష్టం చేసారు.

కేసీఆర్ జిమ్మిక్కులు నమ్మొద్దు.. బీజేపికి అండగా ఉండాలని మునుగోడు ప్రజలకు ఈటల పిలుపు

కేసీఆర్ జిమ్మిక్కులు నమ్మొద్దు.. బీజేపికి అండగా ఉండాలని మునుగోడు ప్రజలకు ఈటల పిలుపు

ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్దంగా ఉండాలని, సోషల్ మీడియాలో దొంగ అకౌంట్స్ తెరిచి మోసం చేయడం, తిమ్మిని బమ్మి చేయడం చంద్రశేఖర్ రావుకు అలవాటని, కానీ ఇంకా నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ఈటల తెలిపారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం వరాల జల్లు కురిపిస్తాడని అందరికీ తెలిసిపోయిందని, ఊర్లకు ఊర్లు దావత్ లకు అడ్డాగా మారుస్తున్నారని ఎద్దేవా చేసారు. అందుకే ఉప ఎన్నిక రావాలి అని అన్ని నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఈటల అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజలు బాగుపడబోతున్నారని, మునుగొడు లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు.

కేసీఆర్ కు ప్రజాధరణ తగ్గింది. అందుకే ఇంఛార్జ్ లను నియమించుకున్నారన్న ఈటల

కేసీఆర్ కు ప్రజాధరణ తగ్గింది. అందుకే ఇంఛార్జ్ లను నియమించుకున్నారన్న ఈటల

మునుగోడులో ఎలాంటి అనుకూల వాతావరణం లేక, ప్రజాధరణ కరువై మసిపూసి మారేడు కాయ చేసి వారి విష పుత్రికలు నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లో
వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే కొట్లాడండి కానీ రండ పనులు చేయకండి అని ఈటల మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎం చేసింది చుప్పుకోవాలని గానీ, సీఎం స్థాయి వ్యక్తి ఎంపీటీసీ లను ఇంఛార్జిలుగా పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఈటల ప్రశ్నించారు. గొర్ల మందల మీద తోడేళ్ళ లాగా పడుతున్నారని, మాట వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారని, గట్టుప్పల్ మండలం ఒక నాయకున్ని 2016 కేసు నమోదు కాగా బుదవారం రోజు అరెస్ట్ చేశారని, ఇది ప్రతీకార రాజకీయం కాదా అని ఈటల నిలదీసారు.

కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి.. మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఈటల

కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి.. మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఈటల

మర్రిగుడెం మండలంలో 40 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఆక్రమించుకున్నారని, సీఎం బెదిరింపులతో భూయజమానులు లొంగిపోయారని, భూమి పత్రాలు ఇచ్చేందుకు అంగీకరించారని, అంటే సీఎం చంద్రశేఖర్ రావు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. మునుగోడు పేద నియోజకవర్గమని, కానీ ఆత్మ గౌరవం ఉన్న ప్రజలని, నల్లగొండ ప్రజలు ధర్మానికి కట్టుబడి ఉంటారని ఈటల స్పష్టం చేసారు. మునుగోడు ప్రజలకు అండగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ఈటల వినమ్రంగా విజ్ఞప్తి చేసారు. చంద్రశేఖర్ రావు దోపిడీ పాలన అంతం కోసం సహకరించాలని ఈటల వేడుకున్నారు. రెవెన్యూ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, గిరిజన రైతులు, దళిత బిడ్డలు అన్ని వర్గాల ప్రజలు మునుగోడులో చంద్రశేఖర్ రావుకు గుణపాఠం చెప్పకపోతే తన అహంకారం తగ్గదని ఈటల పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+