కేసీఆర్ తో కవిత భేటీ - కేటీఆర్ సహా ముఖ్యులకు పిలుపు, కీలక మలుపు..!!
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశంతో రాజకీయంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఇతర పార్టీల నుంచి చేరిక ల విషయంలో ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కొత్త వ్యూహాలతో తమ బలం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జూబ్లీహిల్స్ బై పోల్.. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కాగా, కొంత కాలంగా గులాబీ పార్టీలో రాజకీయ చర్చకు కారణమైన కవిత తన తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు ఫాం హౌస్ కు వెళ్తున్నారు. ఈ సమయంలోనే కేసీఆర్ నుంచి పార్టీ ముఖ్య నేతలకు పిలుపు రావటం ఆసక్తి కరంగా మారుతోంది.
కీలక పరిణామం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి పార్టీ బలోపేతం.. కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా వ్యూహాల అమలు పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా తరచూ పార్టీ నేతలతో సమావేశం అవుతన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు మూడు నెలల గడవులోగా నిర్ణయం తీసుకోవాలి అని ఆదేశించటంతో, ఇక.. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. కాగా.. కొంత కాలంగా గులాబీ పార్టీలో రాజకీయంగా చర్చకు కారణంగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తన తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు సిద్దమయ్యారు. కాగా, అటు కేసీఆర్ ఫాం హౌస్ కు రావాలని కేటీఆర్, హరీష్ తో సహా పార్టీ ముఖ్య నేతలకు సమాచారం పంపారు. వారితో కీలక భేటీ నిర్వహించనున్నారు.

కేసీఆర్ తో కవిత భేటీ
కేసీఆర్ తో కవిత భేటీ కానున్నారు. తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు కవిత అమెరికా వెళ్తున్నారు. 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం మధ్యాహ్నం ఫామ్ హౌస్ కు కవిత వెళ్తున్నారు. కవిత చిన్న కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్ లో చేర్పించేందుకు అమెరికాకు వెళ్తున్నారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు ప్రయాణం కానున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు కవిత తిరిగి రానున్నారు. కాగా.. ఇదే సమయంలో కేటీఆర్, హరీష్ సహా పార్టీ నేతలను రావాలని కేసీఆర్ నుంచి సమాచారం రావటం కీలకంగా మారుతోంది.
కీలక అంశాలపై చర్చ
పార్టీ ముఖ్యులతో కేసీఆర్ నిర్వహించే భేటీలో పలు అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు ఈ సమావేశంలో కీలక భూమిక పోషించే అవకాశం కనిపిస్తోంది. అటు అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్ట్ తదితర పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాగా, ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం మీద ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి.. కౌంటర్ ప్రణాళికలు ఖరారు చేస్తారని సమాచారం. అదే విధంగా వాయిదా పడిన బీసీ సభ గురించి నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications