ఎంసెట్ ఎఫెక్ట్: 'బీజేపీ సీఎం నుంచి కేసీఆర్ కుంభకోణం పాఠాలు'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన విమర్శలు గుప్పించారు.

ఎంసెట్ షాకింగ్: కింగ్ పిన్ ఖలీల్, సీఐడీ తెలివికి విద్యార్థులు ఖంగు

వ్యాపమ్ స్కాం వెనుక హస్తం ఉన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజ్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

జానా, షబ్బీర్ అరెస్ట్

KCR learning lessons from CM MP Shivraj Singh Chauhan: Digvijay

మల్లన్న సాగర్ భూనిర్వాసితులను పరామర్శించేందుకు మెదక్ జిల్లాకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఒంటిమామిడి చెక్‌పోస్టు వద్ద జానారెడ్డి, షబ్బీర్ అలీ వాహనాలను నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని మేడ్చల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ముంపు గ్రామాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే అరెస్ట్‌లను జానా, షబ్బీర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల్లో పర్యటనపై డీజీపీకి ముందుగానే సమాచారం అందించామని, అయినప్పటికీ తమను అనుమతించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.

ఖండించిన భట్టి

జానా, షబ్బీర్ అరెస్టును కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. వారిని అడ్డుకోవడం, అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వైఫల్యాలు బయటపడతాయనే అరెస్టు చేశారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Telangana Medical Exam leak. KCR learning lessons from CM MP Shivraj Singh Chauhan master mind of Vyapam Scam. Guilty must be punished.' Diggy tweeted

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X