కాంగ్రెస్ విజయంతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. అసలు వ్యూహం ఇదే !!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యవహారం ముగిసింది. కాగా మంగళవారం ( నవంబర్ 11, 2025 ) జరిగిన పోలింగ్ అనంతరం అన్ని ఈవీఎంలను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. నేడు (నవంబర్ 14, 2025) కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ నిర్వహించారు. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయ దుందుభి మోగించారు. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు నుంచే ఆధిక్యం కనబరిచిన నవీన్.. ఈవీఎం లెక్కింపులోనూ మొదటి రౌండ్ నుంచే దూసుకుపోయి గ్రాండ్ విక్టరీ కొట్టారు.

కాగా కేవలం ఒక మూడో రౌండ్‌లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీ సాధించినప్పటికీ.. ఆ తర్వాత కాంగ్రెస్ మళ్లీ జోరు అందుకోవడంతో కారు పార్టీ వెనుకంజ వేయక తప్పలేదు. మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాటిజ్ కోల్పోయారు. దాంతో కౌంటింగ్‌ మధ్యలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్‌ రెడ్డి. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి పరాభవానికి ఇవే కారణాలు అంటూ జోరుగా చర్చ నడుస్తోంది. కానీ మొత్తానికి కాంగ్రెస్ విజయంతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

kcr-master-plan-behind-victory-of-congress-at-jubilee-hills-by-polling

ఓటమికి కారణాలు..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి పరాభవం ఎదురవడానికి కారణాలు ఇవే అని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం ఒక పెద్ద లోపంగా పరిగణిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించినప్పటికీ.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మాత్రం దూరంగా ఉన్నారు. ఏఏ కారణంగానే కాంగ్రెస్‌కు ఘన విజయం.. బీఆర్ఎస్‌కు అనూహ్య పరాజయం ఎదురైందని అంటున్నారు.

అంతే కాకుండా కేసీఆర్ ప్రచారంలో పాల్గొని ఉంటే.. బీఆర్ఎస్‌కు ప్రజల్లో మరింత ఉత్సాహం నిండేదని చెబుతున్నారు. ఆయన ప్రసంగాలు ఓటర్లను ఆకట్టుకునేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచి ప్రజలకు కేసీఆర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఒక నాయకుడిలా కాకుండా, దొరలా పాలిస్తున్నారనే కామెంట్స్ సైతం చేశారు. అందుకే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని మండిపడ్డారు.

కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

అయితే ఓ వైపు వరుస పరాజయలు, మరోవైపు కుటుంబంలో గొడవలు కారణంగా కేసీఆర్ కాస్త సైలెంట్ గా ఉంటున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కూడా చెబుతూ రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా గత పదేళ్లలో తాము వైఫల్యం చెందలేదని.. ప్రజలు ఒక అవకాశం మాత్రమే ఇద్దామని కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చి తప్పు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం చేసి, బీఆర్ఎస్ ఓడిపోయి ఉంటే, అది ఆయనకు పెద్ద దెబ్బ తగిలి ఉండేది. ఆయన వచ్చినా గెలవలేదని కాంగ్రెస్ విమర్శించే అవకాశం ఉండేది.

kcr-master-plan-behind-victory-of-congress-at-jubilee-hills-by-polling

అందుకే ప్రచారానికి కేసీఆర్ దూరంగా ఉండి.. కేటీఆర్ ని ముందు ఉంచి తాను వ్యూహం అమలు చేశారని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఓటమి బాధ్యత కేటీఆర్ ఖాతాలో పడిందని, కేసీఆర్ మాత్రం ఈ పరాజయం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తాను ప్రచారం చేసి ఉంటే గెలిచేదని.. బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ కి అవకాశం ఉంటుంది. అందుకే రాజకీయాల్లో గెలుపోటముల కంటే.. సరైన వ్యూహరచన కీలకమని అంటున్నారు. ఒకవేళ వ్యూహం బెడిసికొడితే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+