వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజీబిజీ: కేంద్రమంత్రులతో కెసిఆర్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం బిజీబిజీగా గడిపారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ఉదయం ఉద్యోగ్‌ భవన్‌లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ హెచ్‌ఎస్‌ బ్రహ్మను కేసీఆర్‌ కలిశారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తోమర్‌కు కెసిఆర్ గుర్తు చేశారు. ఖమ్మంలో కర్మాగారం ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో వాటాదారుగా చేరుతుందని స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించామని సిఎం కెసిఆర్ సహా కేంద్ర మంత్రి తోమర్ వెల్లడించారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులతో నెలరోజుల్లో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

నల్గొండ జిల్లాలోని దామరచెరువు వద్దనున్న ఎన్‌టిపిసి విద్యుత్కేంద్రానికి పదివేల ఎకరాల అటవీ భూముకి బదులు ప్రత్యామ్నాయ భూమి కేటాయించినట్టు కేంద్ర పర్యావరణ మంత్రి జావడేకర్‌కు కెసిఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా జావడేకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. మణుగూరు విద్యుత్కేంద్రానికీ, ప్రాణహిత- చేవెళ్ల నీటిపారుదల ప్రాజెక్టుకూ తక్షణం పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలన్నారు. కెసిఆర్ విజ్ఞప్తులకు స్పందించిన మంత్రి జావడేకర్, సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

బీబీనగర్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్రా వైద్య ఆరోగ్య మంత్రి జెపి నడ్డాను కెసిఆర్ కోరారు. ఎయిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పుడున్న 200 ఎకరాలకు అదనంగా మరో వంద ఎకరాలు కేటాయిస్తామని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన చేర్చాలన్నారు. జిల్లాల ఆస్పత్రుల స్థాయి పెంచే పథకంలో తెలంగాణ చేర్చాలని, రాష్ట్రంలో ఫార్మా ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, కెసిఆర్ ప్రతిపాదనలకు నడ్డా సానుకూలంగా స్పందించారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం బిజీబిజీగా గడిపారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ఉదయం ఉద్యోగ్‌ భవన్‌లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో భేటీ అయ్యారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ హెచ్‌ఎస్‌ బ్రహ్మను కేసీఆర్‌ కలిశారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, ఢిల్లీలో ప్రత్యేక అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, లోక్‌సభలో తెరాస పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, నర్సాగౌడ్, రాష్ట్ర మంత్రులు జి కృష్ణారావు, జగదీష్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు సిఎం వెంట ఉన్నారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తోమర్‌కు కెసిఆర్ గుర్తు చేశారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్


ఖమ్మంలో కర్మాగారం ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో వాటాదారుగా చేరుతుందని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్


బయ్యారం ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించామని సిఎం కెసిఆర్ సహా కేంద్ర మంత్రి తోమర్ వెల్లడించారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులతో నెలరోజుల్లో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

ఖమ్మంలో టాస్క్ఫోర్స్ పర్యటించి రెండు నెలల్లో నివేదిక అందిస్తుందన్నారు. తదుపరి తుది నిర్ణయం ప్రకటిస్తామని తోమర్ వెల్లడించారు. కేంద్ర మంత్రి తోమర్‌తో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, తెలంగాణకు సహకరిస్తామని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని బండారు దత్తాత్రేయ వివరించారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

బీబీనగర్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్రా వైద్య ఆరోగ్య మంత్రి జెపి నడ్డాను కెసిఆర్ కోరారు.

కేంద్రమంత్రులతో కెసిఆర్

కేంద్రమంత్రులతో కెసిఆర్

ఎయిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పుడున్న 200 ఎకరాలకు అదనంగా మరో వంద ఎకరాలు కేటాయిస్తామని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన చేర్చాలన్నారు.

English summary
The Centre has decided to constitute a Task Force to examine the possibility of setting up of a steel factory at Bayyaram in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X