వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటన ఇప్పట్లో లేనట్టేనా? తాజా రాజకీయ పరిణామాలతో సందిగ్ధంలో గులాబీబాస్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకొని కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు? పార్టీ కోసం దేశవ్యాప్తంగా పని చేసే కీలక నేతలెవరు? వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జులు ఎవరు? కెసిఆర్ కొత్త పార్టీపై ఎవరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు? అసలు కెసిఆర్ ఎప్పుడు జాతీయ పార్టీని ప్రకటన చేయనున్నారు? వంటి అనేక అంశాలు ఇటు తెలంగాణ ప్రజలలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.

మారుతున్న రాజకీయ పరిణామాలతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనలో జాప్యం

మారుతున్న రాజకీయ పరిణామాలతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనలో జాప్యం

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తర్వాత, జాతీయ పార్టీ ఏర్పాటుకు కసరత్తులు మొదలుపెట్టారు. అయితే ఆ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు నెలల వరకు జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కెసిఆర్ సమాలోచనలు జరుపుతారు అని, ఆ తరువాతనే పార్టీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన రాష్ట్రపతి ఎన్నికలు, ప్రస్తుతం మహారాష్ట్ర లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కెసిఆర్ తాజా రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.

వచ్చేది ఆషాడం... పార్టీ ప్రకటనకు నో ఛాన్స్

వచ్చేది ఆషాడం... పార్టీ ప్రకటనకు నో ఛాన్స్


తాను పెట్టబోతున్న జాతీయ పార్టీ జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చాలంటే, అందుకు అనుకూలమైన సమయం కావాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఏ పని చేసినా మంచి రోజు చూసుకొని ప్రారంభించే సీఎం కేసీఆర్, ఈనెల 30వ తేదీ నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆషాడ మాసం లో ఎటువంటి పనులు చేయరని సమాచారం. అంటే వచ్చే నెలలో జాతీయ పార్టీ ప్రకటన ఉండబోదని తెలుస్తుంది.

జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కే కన్ఫ్యూజన్ ?

జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కే కన్ఫ్యూజన్ ?

ఇక జాతీయ పార్టీని ప్రకటన చేయాలంటే అందుకు ముందుగా టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం పెట్టి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జాతీయ పార్టీని ప్రకటించాల్సి ఉంటుంది. కానీ సీఎం కేసీఆర్ తీరు చూస్తే జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో ఇంకా తాత్సారం చేస్తున్నట్లు గానే కనిపిస్తుంది. జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ తదితరులతో సీఎం కేసీఆర్ అనేకమార్లు మంతనాలు జరిపినప్పటికీ జాతీయ పార్టీకి సంబంధించి ఓ స్పష్టత కెసిఆర్ కు రాలేదని సమాచారం.

బీఆర్ఎస్, టీఆర్ఎస్ లపై ఇంకా తొలగని సందిగ్ధత

బీఆర్ఎస్, టీఆర్ఎస్ లపై ఇంకా తొలగని సందిగ్ధత

ఇంకా బిఆర్ఎస్, టిఆర్ఎస్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్న సందిగ్ధత ఇంకా తొలగిపోలేదు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ప్రకటించి టిఆర్ఎస్ ను అందులో విలీనం చేయడమా? లేక టిఆర్ఎస్ పార్టీనే జాతీయ పార్టీ గా మార్చడమా అన్నదానిపై కెసిఆర్ తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ సీఎం కేసీఆర్ అదును చూసి జాతీయ పార్టీని ప్రకటిస్తారనేది సుస్పష్టమే అయినప్పటికీ మారుతున్న రాజకీయ పరిణామాలతో కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Information that the KCR National Party announcement will be delayed due to the changing political developments in the wake of the Presidential elections and Maharashtra crisis . Also, with Ashada masam is one of the reason.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X