వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ పేరు మార్పు : గుర్తు విషయంలో కీలక నిర్ణయం : సీఎం కేసీఆర్ రె"ఢీ"..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. ఇందు కోసం అవసరమైన మార్పులు - చేర్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. జాతీయ పార్టీ ఖాయమని చెప్పిన పార్టీ అధినేత కేసీఆర్..తాను స్థాపించి..తెలంగాణ సాధించి..అధికారంలో కొనసాగుతున్న తన 22 ఏళ్ల రాజకీయ పార్టీని జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర సమితే.. భారత్‌ రాష్ట్రీయ సమితి లేదా భారత్‌ రాజ్య సమితి పేరిట జాతీయ పార్టీగా రూపాంతరం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

పార్టీ గుర్తు అదే..అజెండాలో మార్పు

పార్టీ గుర్తు అదే..అజెండాలో మార్పు


'భారత్‌ రాజ్య సమితి' అనే పేరు సైతం పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఉన్న కారు గుర్తును యథాతథంగా జాతీయపార్టీలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ జెండా, గుర్తులను గులాబీ రంగులోనే ఉంచి...తెలంగాణ చిత్రపటం స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చే విధంగా మార్పుల దిశగా కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న టీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఆ రోజున పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలోనే ఈ మార్పులతో తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.

19న సమావేశంలో తీర్మానం

19న సమావేశంలో తీర్మానం


గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ను సైతం ఆ పేరుకు ముందు అఖిల భారత పేరు చేర్చి జాతీయ పార్టీగా తీర్మానం చేసి పంపారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం లభించింది. ఇప్పుడు టీఆర్ఎస్ సైతం అదే విధంగా అడుగులు వేస్తోంది. గతంలో ఎన్‌సీపీ, ఎన్‌పీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు తమ పార్టీ తీర్మానాల ద్వారా జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం జాతీయ పార్టీ హోదా ప్రయత్నాల్లో ఉందిదీనికి ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభిస్తే..వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కొత్త పేరు..కొత్త అజెండాతో జాతీయ పార్టీలో ఎన్నికల బరిలో నిలవనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎనిమిది జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, 2,797 గుర్తింపు లేని పార్టీలు నమోదై ఉన్నాయి.

గులాబీ జెండా - జాతీయ అజెండా

గులాబీ జెండా - జాతీయ అజెండా


ప్రస్తుతం కాంగ్రెస్‌, భాజపా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సీపీఐ, సీపీఎం, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), అఖిల భారత తృణమూల్‌ కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలు. వీటిల్లో ఎన్‌సీపీ, ఎన్‌పీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ప్రాంతీయ పార్టీలుగా ఉండి జాతీయ పార్టీలయ్యాయి. జాతీయ పార్టీగా ఉండాలంటే నిబంధనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో రెండు శాతం సీట్లు గెలిచి ఉండాలి. లేదా సాధారణ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల్లో గానీ...శాసనసభ స్థానాల్లో గానీ ఆరుశాతం ఓట్లు పొంది ఉండాలి. టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీగా 22 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ పార్టీకి ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో.. ఈ వారంలో గులాబీ పార్టీలో చోటు చేసుకొనే పరిణామాలు కీలకంగా మారనున్నాయి.

English summary
News making rounds that there will be a change in TRS party's name.but symbol car remains same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X