దేశ రాజకీయాల్లో ప్రభల మార్పు, నేనే ముందుంటా!: కేసీఆర్ సంచలనం

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ప్రభలమైన మార్పు రావాల్సి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అవసరమైతే తాను చొరవ తీసుకుని నడిపిస్తానని చెప్పారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత 70ఏళ్లలో 64ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలనలో ప్రజలకు ఆశించిన మేలు జరగలేదని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భారత రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఏర్పడిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ కేంద్రంగా..

తెలంగాణ కేంద్రంగా..

మూడో ప్రత్యామ్నాయం కేంద్రంగా వస్తుందా? అనే ప్రశ్నకు.. కాదనలేమనే సమాధానం చెప్పారు కేసీఆర్. దేశ ప్రజలు అసహనంతో ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 70ఏళ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. మిగితావారు పాలించిన కాలం చాలా తక్కువ అని అన్నారు.

దేశానికి ఈ రెండు పార్టీలు ఏం చేశాయని అన్నారు.

చైనా వేగంగా అభివృద్ది సాధిస్తుంటే..

చైనా వేగంగా అభివృద్ది సాధిస్తుంటే..

తాగేందుకు నీళ్లు, విద్యుత్ కూడా ఇప్పటికీ లేవని కేసీఆర్ అన్నారు. ‘చైనాలో కరువుతో మావో ఉన్న సమయంలో 1976లో 15లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ దేశం ఏవిధంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అమెరికా తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. విదేశీ మారక విలువలో చైనా నెంబర్ 1గా ఉంది' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన దేశం మాత్రం ఆ విధంగా ఎందుకు అభివృద్ధి చెందడం లేదని అన్నారు.

మూడో ఫ్రంట్ సమయమే..

మూడో ఫ్రంట్ సమయమే..

మూడో ఫ్రంట్ సమయమే చెబుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 70ఏళ్ల ఈ రెండు పార్టీల పాలనలో గుణాత్మకమైన మార్పు రాలేదు. కాంగ్రెస్ పోయి, బీజేపీ వచ్చింది.. రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎంఎస్పీ పెంచాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. వరి, ధాన్యాలకు మద్దతు ధర కల్పించడం లేదని అన్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

చైనాలో నదుల నీళ్లను దేశ వ్యాప్తంగా ప్రాంతాలు ఉపయోగించుకుంటున్నాయి. కానీ, మనదేశంలో నదీ జలాల ఉపయోగం అన్ని ప్రాంతాలకు అందడం లేదని అన్నారు. 2004లో 4లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే.. 2018లో 24లక్షల కోట్లు పెట్టారని.. అంతకుమించి ఏం జరగలేదని అన్నారు. అయితే, దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పరివర్తన అవసరం

పరివర్తన అవసరం

సీనియర్ పాత్రీకేయులు, ఆర్థికవేత్తలు, ప్రజలు దేశ రాజకీయాల్లో ప్రభలమైన మార్పును కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనలు మారితే పథకాల పేర్లు మారతాయి కానీ ఏ మార్పు రాదని అన్నారు. ఏదైనా ఫ్రంట్ రావొచ్చని, దేశంలో పరివర్తన అవసరమని అన్నారు.

6

కేసీఆర్.. దేశ వాసి కాదా?.. గర్వపడేలా

కేసీఆర్.. దేశ వాసి కాదా?.. గర్వపడేలా

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించకూడదా? కేసీఆర్ దేశ వాసి కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గొప్ప మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. అంతేగాక, తాను గర్వపడేలా చేస్తానని అన్నారు. ఇప్పటికే కొందరితో మాట్లాడానని చెప్పారు.

మూడు ప్రభంజనాలు

మూడు ప్రభంజనాలు

తనకు తెలిసి దేశంలో మూడు ప్రభలమైన మార్పులు వచ్చాయని కేసీఆర్ చెప్పారు. ఒకటి జనతా పార్టీ పుట్టిన 60 రోజుల్లేనే అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన టీడీపీ స్వల్ప వ్యవధిలోని అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. ఆ తర్వాత మూడోది టీఆర్ఎస్ పార్టీ అని, పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే పంచాయతీ స్థాయిలో అనూహ్య విజయాలను అందుకుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు దేశ రాజకీయాల్లో మరోసారి రావొచ్చని అన్నారు.

మార్పు జరగని పనికాదు

మార్పు జరగని పనికాదు

దేశ రాజకీయాల్లో ప్రభల మార్పు జరగని పని మాత్రమేమీ కాదని కేసీఆర్ అన్నారు. 100శాతం మార్పు వస్తుందని చెప్పారు. ఢిల్లీకి బాజప్తాగా పోయి చెప్పి చేస్తానని, ఇప్పటికే మాటలు జరుగుతున్నాయని అన్నారు. అన్నారు. దేశ అభివృద్ధిలో వేగంగా జరగడం లేదని అన్నారు. ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, దళితులు, గిరిజనులు హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. తనకు 64ఏళ్లని, మోడీకి చెప్పే తాను దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రధాని కావాలని..

ప్రధాని కావాలని..

ప్రధాని కావాలనే ఆలోచన తనకు లేదని కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం అయితే.. మోడీకి కూడా చెప్పే వస్తానని చెప్పారు. మహారాష్ట్రలో 52శాతం రిజర్వేషన్లుంటే.. తమిళనాడులో 69శాతం ఉందని.. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రాలకు సరైన న్యాయం జరగడం లేదని అన్నారు.

నేనే ముందుండి నడిపిస్తా

నేనే ముందుండి నడిపిస్తా

భారతదేశ రాజకీయాల్లో ప్రభలమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేవుడు సహకరిస్తే అది సాధ్యం చేస్తామని అన్నారు. తానే ముందుండి నడిపిస్తానని చెప్పారు. దేశానికి తెలంగాన నాయకత్వం వహిస్తుంటే గర్వపడాల్సిన విషయమే కాదా? అని అన్నారు. హిందీ రాదా? ఇంగ్లీష్ రాదా? అని అన్న ఆయన.. తాను దేశ రాజకీయాల్లోకి వెళితే గర్వపడేలా చేస్తానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+