మన సచివాలయం దేశంలోనే చెత్త: కేసీఆర్ షాకింగ్, లోపాలు ఇవీ

Posted By:
Subscribe to Oneindia Telugu
మన సచివాలయం దేశంలోనే చెత్త : కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన | Oneindia Telugu

హైదరాబాద్: దేశంలోనే ఇలాంటి చెత్త సచివాలయం లేదని, అందుకే కొత్త నిర్మాణాలు చేపడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో అన్నారు. కొత్త సచివాలయం నిర్మాణంపై విపక్షాల విమర్శలపై మండిపడ్డారు.

'రేవంత్ వేరేవ్యక్తి కాదు, మా అల్లుడే': అలా షాకిచ్చిన కాంగ్రెస్ నేత

 కాంక్రీట్ జనరల్ సరికాదు

కాంక్రీట్ జనరల్ సరికాదు

ఈ అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్‌ జంగిల్‌ అయిపోతుందని సభ్యులు మాట్లాడటం తగదన్నారు. మన సచివాలయం బాగోలేదని, దేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనది అన్నారు.

 ఇంత అడ్డదిడ్డమైన సచివాలయం లేదు

ఇంత అడ్డదిడ్డమైన సచివాలయం లేదు

ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భవనాలు కట్టేశారని కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా ఇంత అడ్డదిడ్డమైన సచివాలయం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారే గందరగోళంగా ఉంటుందన్నారు. ప్రధాన విభాగాలు విసిరేసినట్లు ఉన్నాయన్నారు.

ఆ మైదానం క్రీడలకు కాదు

ఆ మైదానం క్రీడలకు కాదు

సచివాలయంలో ఒక్క భవనం కూడా నియమనిబంధనల ప్రకారం నిర్మించలేదని కేసీఆర్ తెలిపారు. నగరంలో క్రీడామైదానాలకు కొదవలేదని, 19 పెద్ద, ఇతర మైదానాలు ఉన్నాయన్నారు. బైసన్‌పోల్‌ మైదానం క్రీడలకు ఉద్దేశించింది కాదని, మిలటరీ వాళ్లదన్నారు.

 కొత్తవి కట్టి తీరుతాం

కొత్తవి కట్టి తీరుతాం

మన శాసన సభలో పార్కింగ్‌ సౌకర్యాలే లేవని కేసీఆర్‌ అన్నారు. శాసన సభ నుంచి మండలికి వెళ్లాలంటే సరైన దారి లేదన్నారు. దేశంలోనే అద్భుతమైన, చారిత్రకమైన సచివాలయం, శాసనసభ, మండలి, పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ భవనాలు మన తెలంగాణలో నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టి తీరుతామన్నారు.

 అనుమతులు రాగానే ప్రారంభం

అనుమతులు రాగానే ప్రారంభం

నిర్మాణాల విషయంలో తాము ఏకపక్షంగా వెళ్లడం లేదని కేసీఆర్ అన్నారు. ప్రజల ఆమోదం ుందన్నారు. గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా ఈ ఆలోచనలు చేశారన్నారు. గాంధీ నగర్‌లో కొత్త నిర్మాణాలపై ప్రధాని మోడీని అడిగానని చెప్పారు. కేంద్రం అనుమతులు రాగానే ప్రారంభిస్తామన్నారు. 151 ఎకరాల్లో అసెంబ్లీ, సచివాలయం, హెచ్ఓడీ బిల్డింగ్ కడతామన్నారు.

 ఇన్ని లోపాలు

ఇన్ని లోపాలు

ప్రస్తుత సచివాలయంలో ఫైర్ సేఫ్టీ లేదని కేసీఆర్ అన్నారు. ప్రమాదం జరిగితే సచివాలయానికి ఫైరింజన్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఒక్క భవనం నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సరైన పార్కింగ్ సదుపాయం లేదన్నారు. కొత్త నిర్మాణాలకు రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నామనేది సరికాదన్నారు. కేవలం రూ.500 కోట్లలోపే అవుతాయన్నారు. గతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే సచివాలయంలో పైళ్లు దగ్ధమయ్యాయని, ఫైళ్లు భద్రపరిచే సముదాయం లేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on New assembly and secretariate in Assembly.
Please Wait while comments are loading...