వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ ఎపిసోడ్: టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌, నేతలకు బంపరాఫర్లు

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టిడిపి ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరకుండా టిఆర్ఎస్‌లోకి ఆహ్వనించాలని ఆ పార్టీ చీఫ్ కెసిఆర్ మంత్రులకు, పార్టీ ముఖ్యులను ఆదేశించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టిడిపి ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరకుండా టిఆర్ఎస్‌లోకి ఆహ్వనించాలని ఆ పార్టీ చీఫ్ కెసిఆర్ మంత్రులకు, పార్టీ ముఖ్యులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరపరిస్థితులు వచ్చే అవకాశం ఉందని టిఆర్ఎస్ భావిస్తోంది.

సీతక్క టిడిపికి ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్, ఫోన్ స్విచ్ఛాప్ అందుకేనా?సీతక్క టిడిపికి ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్, ఫోన్ స్విచ్ఛాప్ అందుకేనా?

తెలంగాణ రాష్ట్రంలో టిడిపి నుండి కీలక నేతలు రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సహన్ని ఇచ్చింది. ద్వితీయశ్రేణి నాయకులతో పాటు టిడిపి ముఖ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా జాగ్రత్తపడాలని కెసిఆర్ మంత్రులకు సూచించారు.

తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బతెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ

టిడిపి నుండి బయటకు వచ్చేందకు ఆసక్తిని చూపుతున్న నేతలతో చర్చించాలని కెసిఆర్ పార్టీ ముఖ్యులకు సలహ ఇచ్చారు. దరిమిలా పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా రంగంలోకి దిగారు. టిడిపికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలపై కేంద్రీకరించారు. ముఖ్యంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై టిఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది.

రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''

టిడిపి నేతలపై టిఆర్ఎస్ గురి

టిడిపి నేతలపై టిఆర్ఎస్ గురి

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కొనసాగిస్తున్న ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌' కార్యక్రమానికి మరింతగా పదును పెట్టాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు అధికార టీఆర్‌ఎస్‌ చీఫ్ కెసిఆర్ ఆదేశించారు. తాజా రాజకీయ పరిణామాలు, సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లోకి పెద్దఎత్తున వలసలను ప్రోత్సహించాలని ఆదేశించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలను నివారించాలని కెసిఆర్ సూచించారని పార్టీ వర్గాల సమాచారం.

 పార్టీలో చేరే నేతలకు ఆఫర్లిస్తున్న టిఆర్ఎస్

పార్టీలో చేరే నేతలకు ఆఫర్లిస్తున్న టిఆర్ఎస్

కాంగ్రెస్‌, టీడీపీ నేతలను టీఆర్‌ఎస్ లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కెసిఆర్ పార్టీ నేతలకు సూచించారు. అర్హత, స్థాయి ప్రకారం ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులు ఇస్తామనే హామీలు ఇవ్వాలని టిఆర్ఎస్ అధినేత మంత్రులు, పార్టీ ముఖ్యులకు చెప్పారని అంటున్నారు.కొత్తగా ఇతర పార్టీల నుండి ముఖ్యంగా టిడిపి నుండి చేరే వారి విషయంలో వ్యయప్రయాసలను లెక్క చేయవద్దనే సంకేతాలు అధిష్ఠానం నుంచి అందాయి.

ఆపరేషన్ ఆకర్ష్‌కు రంగంలోకి దిగిన మంత్రులు

ఆపరేషన్ ఆకర్ష్‌కు రంగంలోకి దిగిన మంత్రులు

కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌లోకి రాకపోతే ప్రస్తుతమున్న పార్టీల్లోనే వారు కొనసాగేలా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యూహన్ని సమర్థవంతంగా అమలు చేస్తే 2019 ఎన్నికల్లో ఇబ్బందికర వాతావరణం ఉండదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

 జిల్లాల వారీగా సమావేశాలు

జిల్లాల వారీగా సమావేశాలు

ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రులు పూర్వ జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో లంచ్‌ భేటీలు, రాత్రిపూట విందు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ నుంచి ఎవరు కొత్తగా వచ్చే అవకాశం ఉందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరితే ఏం ఆశిస్తున్నారనే అంశాలపై చర్చిస్తున్నారు. అవసరమైతే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులను కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
KCR concentrated on TDP key leaders in various Assembly segments. Kcr ordered to party leaders to discuss Tdp leaders for join in TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X