రేవంత్ Vs కేసీఆర్.. సై - ఇక నేరుగా, ముహూర్తం ఫిక్స్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. రేవంత్ వర్సస్ కేసీఆర్ రాజకీయ పోరాటం కొత్త టర్న్ తీసుకుంటోంది. చాలా కాలం తరువాత పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, కేసీఆర్ కు అసెంబ్లీకి రావాలని.. అక్కడ చర్చ చేయాలని రేవంత్ ఛాలెంజ్ చేసారు. దీంతో.. ఇప్పుడు కేసీఆర్ సైతం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఇద్దరి మధ్య అసెంబ్లీ వేదికగా చోటు చేసుకునే రాజకీయం పై ఆసక్తి నెలకొంది.
సీఎం రేవంత్ - మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. కొడంగల్ వేదికగా గులాబీ బాస్‌కు బిగ్ సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ ప్రారంభం అవుతున్న వేళ.. నీళ్లా..నిధులా..నియమకాలా, సంక్షేమ పథకాలా.. ఆప్షన్ మీదే..ఏ అంశామైనా చర్చించేందుకు రెడీ అంటూ ఓపెన్ గా సవాల్ చేసారు.

సభా వేదికగా ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేసారు. కేసీఆర్ సభకు వస్తే..కృష్ణా జలాల పైన చర్చ చేసి అన్ని అంశాలను ప్రస్తావించాని రేవంత్ భావిస్తున్నారు. అటు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే ముందే ఈ వ్యవహారానికి ముగింపు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ సైతం ఈ వ్యవహారంలో ముందుకే వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం.
కృష్ణాజలాల అంశంతో పొలిటికల్‌గా తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని.. ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ వ్యూహం. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో సభలకు రెడీ అవుతున్నారు. ఈ మీటింగ్‌లకు తాను స్వయంగా హజరవుతానని..ఇక నుంచి ఐయామ్ ఆన్ ది ఫీల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు ఖరారయ్యాయి. సభకు రావాలని రేవంత్ సవాల్ చేసారు. దీంతో... కేసీఆర్ సైతం అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం.
సభలో తానే కృష్ణాజలాల పై మాట్లాడాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే.. బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా కేసీఆర్ ద్విముఖ వ్యూహం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పాలమూరు నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. దీంతో.. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications