వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫెడరల్ ఫ్రంట్: పార్టీలతో సమన్వయానికి టీమ్, ఢిల్లీలో చక్రం తిప్పనున్న కెసిఆర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ మరింత దూకుడును పెంచనున్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడానికి టిఆర్ఎస్‌కు చెందిన సుమారు 20 మంది నేతలు న్యూఢిల్లీలో మకాం వేయనున్నారు. టిఆర్ఎస్ ప్లీనరీ తర్వాత వీరంతా ఢిల్లీలోనే ఉండేలా కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.

కెసిఆర్ దూకుడు: అక్టోబర్‌లో ఫెడరల్ ఫ్రంట్ సభ, సిపిఎం నేతలతో భేటీ కెసిఆర్ దూకుడు: అక్టోబర్‌లో ఫెడరల్ ఫ్రంట్ సభ, సిపిఎం నేతలతో భేటీ

దేశంలో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని పార్టీల నేతలతో కెసిఆర్ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు.

తెలంగాణ సీఎం కెసిఆర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశమయ్యారు.ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో కూడ కెసిఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది.మరో వైపు ఫెడరల్ ఫ్రంట్‌లోకి ప్రాంతీయ పార్టీలను ఆహ్వనించేందుకు టిఆర్ఎస్ నాయకత్వం చర్యలను తీసుకొంటుంది.

 ప్లీనరీ తర్వాత ఢిల్లీలో టిఆర్ఎస్ నేతల మకాం

ప్లీనరీ తర్వాత ఢిల్లీలో టిఆర్ఎస్ నేతల మకాం

ఫెడరల్ ప్రంట్‌లోకి దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వనించేందుకు గాను టిఆర్ఎస్ నేతలు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఏప్రిల్ చివరి వారంలో టిఆర్ఎస్ ప్లీనరీ ఉంది.ఈ ప్లీనరీ ముగిసిన తర్వాత టిఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు , ముఖ్య నేతలు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. 20 మంది టిఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేసి ప్రాంతీయ పార్టీలతో పాటు ఇతర పార్టీల నేతలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై సమన్వయం చేయనున్నారు.ఆయా పార్టీల నేతలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించనున్నారు.

ఎంపీలు, ఎమ్మెల్సీలతో కెసిఆర్ కమిటీ

ఎంపీలు, ఎమ్మెల్సీలతో కెసిఆర్ కమిటీ

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై ఇతర పార్టీలతో చర్చించేందుకు గాను టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాధవ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు వివేక్‌తో పాటు మరికొందరు నేతలకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ కమిటీ ఆయా పార్టీల నేతల తో చర్చించనుంది. పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత ఈ కమిటీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వనం

ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వనం

ఇంగ్లీష్, హిందీ భాషపై మంచి పట్టున్న నేతలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని పార్టీల నేతలను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించేందుకు కెసిఆర్ ఎంపిక చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన డి.శ్రీనివాస్‌, కె.కేశవరావు లాంటి నేతలతో పాటు దేశంలోని పలు పార్టీలతో పరిచయాలున్న నేతలకు కెసిఆర్ ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. ఈ కమిటీ సభ్యులు ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని ఆయా పార్టీల నేతలను ఆహ్వనించనున్నారు.

 జాతీయ రాజకీయాలపై స్పష్టత

జాతీయ రాజకీయాలపై స్పష్టత

జాతీయ రాజకీయాలపై తమ పార్టీ విధానాన్ని ప్లీనరీ వేదికగా టిఆర్ఎస్ ఇవ్వనుంది. ఈ మేరకు టిఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలకు సంబంధించిన విషయాలను పార్టీ ఎంపీ కె. కేశవరావు పర్యవేక్షిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై టిఆర్ఎస్ రాజకీయ తీర్మానం ప్లీనరీలో మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అసవరమేమిటనే విషయాన్ని ఈ నివేదికలో స్పష్టం చేసే అవకాశం లేకపోలేదు.

English summary
TRS chief KCR planning to co ordinate with regional parties for Federal front. Kcr will constitute a committee for coordinate with regional parties. 20 members of committee co ordinate with regional parties from Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X