కవితకు కేసీఆర్ బిగ్ షాక్..షోకాజు నోటీసులు జారీ..?
కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం అంతర్గత పోరు ముదురుతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా, కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.'మై డియర్ డాడీ' అంటూ ప్రారంభమైన ఈ లేఖలో, కవిత కేసీఆర్ చేస్తున్న తప్పొప్పులను సూటిగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై తన అభిప్రాయాలను పాజిటివ్, నెగటివ్ అంశాలతో వివరించారు.
కేసీఆర్ దేవుడే కానీ... ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆదిలోనే ఈ అంతర్గత వివాదానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్, పార్టీ క్రమశిక్షణ నియమాల ప్రకారం కవితకు షోకాజు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరోవైపు, బీఆర్ఎస్ శ్రేణుల్లో కవిత చేసిన వ్యాఖ్యలపై బాహాటంగానే చర్చ జరుగుతోంది. పార్టీ భవిష్యత్తుపై ఈ అంతర్గత విభేదాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.ఇదిలా ఉండగా, కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇంట్లో రాజకీయ వేడి తట్టుకోలేక కేటీఆర్ ఇలా ఆరోపణలు చేస్తున్నారు, ముందు తమ పార్టీ సంగతి చూసుకోవాలని కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌కు సలహా ఇస్తున్నారు.మరి కల్వకుంట్ల కుటుంబంలోని ఈ అధికార పోరు బీఆర్ఎస్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications