కేసీఆర్ రాజకీయ చాణక్యం; ఆ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్!!

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారి, పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న వేళ బిఆర్ఎస్ వేసిన ఒక అడుగు ప్రజలలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశాన్ని మర్చిపోయేలా చేసింది. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీతో, టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై చర్చ జనాలలో కాస్త తగ్గింది.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ తర్వాత, పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంతో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భావించిన ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ సూత్రధారి అంటూ అరెస్ట్ చేయడం ఊహించని పరిణామం.

KCR political strategy; BRS succeeded in diversion politics!!

వరంగల్ జిల్లాలో జరిగిన పదవ తరగతి హింది ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పట్టుబడిన మాజీ విలేకరి బూరం ప్రశాంత్, బండి సంజయ్ కు ప్రశ్నాపత్రాన్ని పంపించడం, అంతకు ముందు రోజు వారిద్దరూ వాట్సాప్ కాల్ మాట్లాడడం వంటి పరిణామాలు బిఆర్ఎస్ పార్టీకి సరిగ్గా పనికొచ్చాయి. దీంతో బండి సంజయ్ ను అరెస్ట్ చేసి, అనేక నాటకీయ పరిణామాల మధ్య, ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్ అరెస్టు కు హైప్ క్రియేట్ చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపించారు.

ఇక దీంతో తెలంగాణ రాష్ట్రంలో జనాల ఫోకస్ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ నుండి, బండి సంజయ్ అరెస్ట్, ఆయనను జైలుకు తరలింపు, ఆ తర్వాత బీజేపీ ఏం చేస్తుంది అన్న అంశంపై పడింది. మొత్తానికి టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని డైవర్ట్ చేసి, ప్రభుత్వ అసమర్థతను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహం సాగింది.

అలాగే పదేపదే కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో తెలంగాణ మంత్రులను, నేతలను టార్గెట్ చేస్తున్న బిజెపికి కూడా ఒక ఝలక్ ఇచ్చేలా, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం కూడా రాష్ట్రంలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాల దాడి మరింత పెరగకుండా, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ లో బిజెపి ఉందన్న విషయాన్ని ప్రజా క్షేత్రంలో హైలెట్ చేసి బి ఆర్ ఎస్ మంత్రులు దాడి చేయడం, సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన బిజెపి తమను తాను రక్షించుకునే ప్రయత్నం చేయడం ప్రధానంగా కనిపించింది.

ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ ల లీకేజ్, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో రీప్లేస్ చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది అన్న భావన రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోను వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+