తగ్గను, కచ్చితంగా వర్సిటీ స్థలం తీసుకుంటాం:కేసీఆర్
హైదరాబాద్: విశ్వవిద్యాలయాల స్థలాలను కచ్చితంగా తీసుకుంటామని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం పునరుద్ఘాటించారు. ఈ జమానాలో విశ్వవిద్యాలయాలకు 500 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.
పేదల ఇళ్లకే ఆ భూమిని వినియోగిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఉఫ్ అంటే భూములు పుట్టుకు వస్తాయా అని నిలదీశారు. తాను మొండి మనిషిని అని, సాధించేదాకా వెంటపడతానని చెప్పారు. ప్రతిపక్షాలు, విద్యార్థుల పైన కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెచ్యూరిటీ లేని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, పార్టీలు వత్తాసు పలకడం విడ్డూరమన్నారు. తాను వారి అయ్యకు కూడా భయపడనన్నారు. ఇళ్లు గాంధీ బొమ్మ నెత్తిన కట్టాలా అని ప్రశ్నించారు. వేదంలో నక్సలిజం కంటే పెద్ద సూత్రం ఉందని, మన సంస్కృతి ఏమవుతోందని ప్రశ్నించారు. ఉగాదిని మరిచి డిసెంబర్ 31 వేడుకలు విడ్డూరమన్నారు.

కేసీఆర్
ఉస్మానియా యూనివర్సిటీలో 11ఎకరాలు తీసుకుంటామంటే రభస చేస్తున్నారని, మెచ్యూరిటీ లేని నలుగురు విద్యార్థులు మాట్లాడగానే, రాజకీయ పార్టీలు స్టేట్‌మెంట్లు ఇవ్వడం విడ్డూరమని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఆయన మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో పర్యటించారు. బౌద్ధనగర్ కమ్యూనిటీ హాలులో స్థానికులతో సమావేశమయ్యారు.

కేసీఆర్
సికింద్రాబాద్ నియోజకవర్గంలో 7500 కుటుంబాలకు ఇల్లు కట్టివ్వాలని, మొత్తం నియోజకవర్గంలో జూనియర్, డిగ్రీ, హైస్కూల్ లేదని, ఆస్పత్రి లేదని, ఇవన్నీ కట్టాలన్నారు. వాటికి ఎక్కడో సర్దాలన్నారు.

కేసీఆర్
పాపం ఎవరో నలుగురు విద్యార్థి పోరగాండ్లు మెచ్యూరిటీ లేక ఏదో మాట్లాడంగనే అబ్బ దీన్ని మించిన ఉద్యమం లేదురా అని కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక స్టేట్‌మెంట్, ఇంకో పార్టీ ఆయన ఇంకో స్టేట్‌మెంట్ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్
అయినా భయపడేది లేదని, తాను చేయాలనుకున్నది చేసి తీరుతానని తెలిపారు. వాళ్ల అయ్యకు కూడా భయపడనన్నారు.

కేసీఆర్
నిజానికి వర్సిటీలకు అంత జాగా అవసరం లేదన్నారు. ఉదాన్యవన యూనివర్సిటీ పెడ్తం.. 500 ఎకరాల స్థలం చూపించండని కేంద్రం నాకు లేఖ రాసిందని, మొన్న ప్రధాని మోడీని కలిసినపుడు ఆ లేఖ చూపించానని, ఇదేంటయ్యా, యూనివర్సిటీకి ఇన్ని ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారన్నారు. అలాగైతే కాంగ్రెస్‌కు నీకు తేడా ఏంటని అడిగారన్నారు. 50 ఎకరాలు చాలని చెప్పారన్నారు. ఆయన మంచి మాట చెప్పారన్నారు.

కేసీఆర్
వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పేదలను పట్టించుకోలేదని, పేదోళ్ల జీవితాల్లో మార్పు వారికిష్టం లేదని, హైదరాబాద్‌లో రేస్ కోర్సులు, గోల్ఫ్ క్లబ్బులు, పేకాట క్లబ్బులకు వందల ఎకరాల భూములు ఇచ్చారన్నారు.

కేసీఆర్
గరీబోళ్లకు ఇండ్లు కట్టేందుకు ప్రభుత్వ స్థలాలు వినియోగిస్తమంటే చిల్లర రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. సుందర్ నగర్‌లో 65 గదిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులుండటం గమనించానన్నారు.

కేసీఆర్
ముఖ్యమంత్రి కాబట్టి బయటకు ఏడిస్తే బాగుండదని ఏడ్వలేదని తెలిపారు. మనసులో మాత్రం కన్నీరు పెట్టుకున్నానని చెప్పారు.

కేసీఆర్
వేదంలో నక్సలిజం కంటే పెద్ద సూత్రం ఉందని, సంపాదించిన దాంట్లో సాటి వారికి దానం చేయాలని చెప్పారని,మన సంస్కారం, నాగరికత ఏమిటన్నారు.

కేసీఆర్
ఉగాదిని మరిచిపోయి డిసెంబర్ 31న తందనాలు ఆడుతున్నారని, కొట్టుకొని పోతున్నామని, పేదలకు న్యాయం చేసే విషయంలో వెనక్కి పోనన్నారు.

కేసీఆర్
నగరంలోని రెండు లక్షల మంది నిరుపేదలకు దశలవారీగా ఇండ్లు కట్టించి తీరుతానని చెప్పారు. అందుకు ఖచ్చితంగా ప్రభుత్వ భూములనే ఉపయోగించుకుంటుందన్నారు.

కేసీఆర్
ప్రజలూ ధర్మం, న్యాయం వైపు నిలబడాలన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, సీఎం ఎవరికీ భయపడొద్దని, ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తి గొప్పదన్నారు. వేలుతో కొడితే ఏం తాకుతుందని, పిడికిలి బిగించి గుద్దితే మొహం పచ్చడవుతుందన్నారు. బస్తీకో కథానాయకుడు పుట్టాలన్నారు.

కేసీఆర్
హైదరాబాద్ నగరంలో పరిశుభ్రం చేయడంలో సఫాయి కర్మచారీలే కీలకమని, తల్లిదండ్రులు, దేవుళ్ల తర్వాత మనం మొక్కాల్సింది, గౌరవించాల్సింది వారినే అన్నారు. అని కేసీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications