దేశంలోనే నెంబర్‌వన్: కేసీఆర్‌ను కలిసిన సింగరేణి సీఎండీ (ఫోటోలు)
హైదరాబాద్: సింగరేణి కాలరీస్‌పై సీఎం కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సీఎం కేసీఆర్‌ను సోమవారం క్యాంపు ఆఫీసులో కలిశారు. 2014-15 సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ గడించిన లాభాలకు సంబంధించి డివిడెండ్ రూ.66.42 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థను అభినందించారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సింగరేణి సీఎండీ, ఇతర ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.

కేసీఆర్‌ను కలిసిన సింగరేణి సీఎండీ
ఈ సందర్భంగా సింగరేణి కార్యకలాపాలపై కేసీఆర్ సమీక్షను నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.490 కోట్లు లాభాలు పొందిందని ఈ సందర్భంగా సీఎండీ శ్రీధరన్ సీఎంకు తెలిపారు. 51 శాతం వాటా ఉన్న తెలంగాణ రాష్ర్టానికి రూ.66.42 కోట్లు, కేంద్రానికి 49 శాతం వాటాగా రూ.63.58 కోట్లు లభిస్తాయని ఆయన వివరించారు.

కేసీఆర్‌ను కలిసిన సింగరేణి సీఎండీ
అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి ఉత్పత్తి సాధిస్తుందని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా సింగరేణి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని అన్నారు. అన్నింటినీ సానుకూలంగా విన్న సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ను కలిసిన సింగరేణి సీఎండీ
తెలంగాణ రాష్ట్రంలో మరో 50 ఏళ్లకు సరిపడా బొగ్గు నిలువలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం రామగుండం ఎరువుల కర్మాగారంపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సహకరిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ను కలిసిన సింగరేణి సీఎండీ
రామగుండం ఎరువుల కర్మాగారానికి ఎల్లంపల్లి ఇంటెక్ వెల్ నుంచి 0.55 టీఎంసీల నీటిని ఇస్తామన్నారు. అంతేకాకుండా 40 మెగావాట్ల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వల్ల 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications