సీఎం రివ్యూ: యాదగిరి గుట్ట కొత్త డిజైన్ ఇదే(ఫోటోలు)
హైదరాబాద్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి విషయంలో ఢిల్లీలోని అక్షరధామ్, అమృతసర్‌లోని స్వర్ణదేవాలయం వంటి ప్రఖ్యాత ఆలయాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
యాదగిరి గుట్ట గుడి అభివృద్ధికి కంకణం కట్టుకున్నకేసీఆర్ అభివృద్ధి, డిజైన్లు మొత్తం ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేశారు. ఆలయ స్పెషల్ ఆఫీసర్ జీ కిషన్‌రావు, యాదగిరి గుట్ట దేవాలయం అభివృద్ధికి డిజైన్లు తయారు చేసిన స్థపతి సౌందరరాజన్, ఆర్కిటెక్టులు రాజ్ ఎక్స్‌పెడిత్, ఆనందసాయి, జగన్ మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు.
యాదగిరి గుట్ట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికి గుట్ట ప్రత్యేకాధికారి జీ కిషన్‌రావు చీఫ్‌గా ఉంటారని పేర్కొన్నారు. ఈ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో గుట్ట, భూమి అభివృద్ధి, పరిపాలనలో ఒక భాగంగా ఉంటుందని సీఎం తెలిపారు.

యాదగిరి గుట్టకు రూ. 100 కోట్లు
గుట్టకు వచ్చే యాత్రికులు, భక్తులకు సరిపోయేంత విశ్రాంతి స్థలం ఉండాలని, కావల్సినన్ని అతిథిగృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. సంప్రదాయం ప్రకారం గుట్టలో ఒకరోజు రాత్రి బస చేసేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. సంప్రదాయబద్ధంగా సామూహిక వ్రతం నిర్వహించుకోవడానికి సరిపోయినంత స్థలం ఉండేలా చూడాలని సూచించారు.

యాదగిరి గుట్టకు రూ. 100 కోట్లు
యోగశాల, కళ్యాణమండపం, ఆధ్యాత్మిక బోధనల వేదికను ఏర్పాటుచేసేలా డిజైన్ ఉండాలని సీఎం సూచించారు. గుట్టపై ఉన్న 10 ఎకరాలకుపైగా స్థలంలో దేవాలయ ప్రాంగణం 5 ఎకరాల్లో ఉండాలని, మిగతా 5 ఎకరాల్లో కళ్యాణమండపం, యాగశాల, ఆధ్యాత్మిక బోధనల కేంద్రం ఉండేలా చూడాలని సీఎం సూచించారు.
యాదగిరి గుట్టకు రూ. 100 కోట్లు
కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుట్ట అభివృద్ధి కోసం సమీక్ష జరిపేందుకు ముచ్చటగా మూడోసారి రానున్నారు. ఆగమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు, శ్రీవారి రాజగోపురం స్వర్ణమయం చేయడం, షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణం తదితర విషయాలపై సీఎం సమీక్షించనున్నారు.

యాదగిరి గుట్టకు రూ. 100 కోట్లు
యాదగిరి నరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 27న స్వామివారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.












Click it and Unblock the Notifications