వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదవారి బ్రతుకులు ఛిద్రం.!కేసీఆర్ పాలన దుర్మార్గం.!మరోసారి విరుచుకుపడ్డ షర్మిళ.!

|
Google Oneindia TeluguNews

భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్ : పేదవాడి బ్రతుకులు ఛిద్రం అవుతున్నా స్పందించని సీఎం చంద్రశేఖర్ రావు పాలన ఎంత దుర్మార్గం గా ఉందో అర్థం అవుతుందని వైయస్సార్ టీపీ అద్యక్షురాలు వైయస్ షర్మిళ మరోసారి మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గం, దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామంలో రైతు గోస ధర్నా లో వైఎస్ షర్మిళ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.

కేసీఆర్ రైతు వ్యతిరేకి.. పంటనష్టం ఊసే ఎత్తని ప్రభుత్వమన్న షర్మిళ

కేసీఆర్ రైతు వ్యతిరేకి.. పంటనష్టం ఊసే ఎత్తని ప్రభుత్వమన్న షర్మిళ

అసలు ప్రజలు ఎట్లా బ్రతుకుతున్నారు.?వారికి ఏం కావాలి అని కనీసం అడిగే వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగంలో లేదని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామంలో ప్రజలు సమస్యలతో కన్నీళ్లు పెడుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఒక్క సారి కూడా పలకరించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి డబ్బులకు అమ్ముడు పోయారని, ఇది ఆ ఎమ్మెల్యేకి రాజకీయం వ్యభిచారం అనిపించడం లేదా అని ప్రశ్నించారు షర్మిళ.

సీఎం ఫాహౌస్ కే పరిమితం.. ఎమ్మెల్యేలు కూడా ఫాంహౌసులకే పరిమితమన్న షర్మిళ

సీఎం ఫాహౌస్ కే పరిమితం.. ఎమ్మెల్యేలు కూడా ఫాంహౌసులకే పరిమితమన్న షర్మిళ

అంతే కాకుండా డిగ్రీ కాలేజీ తెస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చాడని కానీ ఇంతవరకూ హామీ హామీగానే మిగిలిపోయింది గానీ కాలేజీ మాత్రం రాలేదని విమర్శించారు. లీడర్ ఏవిధంగా పని చేస్తాడో క్యాడర్ కూడా అదే విధంగా అన్నట్లుగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఫామ్ హౌస్ కట్టుకొని భోగాలు అనుభవిస్తున్నాడని షర్మిళ ఎద్దేవా చేసారు.
ఓటు అనేది ప్రజల ఆయుధమని, ఈ సారి ఆలోచన చేయాలని, చంద్రశేఖర్ రావును నమ్మి రెండు సార్లు ఓట్లేస్తే నిండా ముంచలేదా అని ప్రశ్నించారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు ప్రజల దగ్గరకు వస్తారని, తర్వాత ఫామ్ హౌజ్ లకు వెళ్తారని అన్నారు.

రైతులకు వరి సమస్యలు.. పట్టించుకోని ప్రభుత్వమన్న వైయస్ షర్మిళ

రైతులకు వరి సమస్యలు.. పట్టించుకోని ప్రభుత్వమన్న వైయస్ షర్మిళ

అంతే కాకుండా ఎనిమిదేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు పురుగుల మందు తాగుతారు, ఎందుకు ఉరి వేసుకుంటారని ప్రభుత్వాన్న షర్మిళ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ అని చెప్పి 7 గంటలకు కుదించారని, వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగ గా ఉండేదని షర్మిళ గుర్తు చేసారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే పండిన దానికంటే ఎక్కువగా నష్టపరిహారం ఇచ్చారని గుర్తు చేసారు.

దూకుడు పెంచిన షర్మిళ.. 75వ రోజుకు చేరిన పాదయాత్ర

దూకుడు పెంచిన షర్మిళ.. 75వ రోజుకు చేరిన పాదయాత్ర

సీఎం చంద్రశేఖర్ రావు పాలనలో నష్ట పరిహారం అనే పదమే లేదని, పంట భీమా అన్న పదమే లేదని, ప్రకృతి ప్రకోపంతో నష్ట పోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దిక్కు లేదన్నారు షర్మిళ. కనీసం రైతుకు బరోసా కూడా లేదని, 25 వేలు ఇచ్చే పథకాలు బంద్ పెట్టీ ముష్టి 5 వేలు ఇస్తూ గొప్పలు చెప్తున్నారని మండిపడ్డారు.
వరి వేసుకున్న రైతులు మద్దతు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, 2వేలు మద్దతు ధర ఉంటే 11వందల తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అన్నారు. రైతుకు తీరని అన్యాయం జరుగుతుందని, పాలకులు ఉండి కూడా రైతులు ఎందుకు నష్టపోవాలని నిలదీసారు. నేటితో వైయస్ షర్మిళ తన ప్రజా ప్రస్థాన నాద యాత్ర 75వ రోజుకు చేరుకుంది.

English summary
YSRCP president YS Sharmila has once again lashed out at CM Chandrasekhar Rao for not responding to the plight of the poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X