కెసిఆర్‌ను కలిసిన యాంకర్ ఉదయభాను, ఎందుకంటే?
హైదరాబాద్: ప్రముఖ యాంకర్ ఉదయభాను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బుదవారం నాడు కలిశారు. తన కవల పిల్లల పుట్టినరోజు వేడుకలకు హజరుకావాలని ఉదయభాను ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆహ్వనించారు.
ఈ రోజు తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశానని యాంకర్ ఉదయభాను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది. కేసీఆర్ లాంటి డైనమిక్ లీడర్‌ను కలవడం పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా కేసీఆర్‌తో దిగిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది.

కేసీఆర్ తమను ఆశీర్వదించారని పేర్కొంది. ఉదయభాను కవల పిల్లల తొలి పుట్టినరోజు వేడుక వచ్చేనెల 3న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఈ సందర్భంగానే ఆమె కేసీఆర్‌ను కలిసి, ఆ వేడుకకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం.
ఉదయభానుతో ఆమె భర్త విజయ్ కూడ ఉన్నారు. అయితే ఉదయభాను ఆహ్వనం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించారని సమాచారం.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయభాను పిల్లల పుట్టిన రోజు వేడుకలకు హజరౌతారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications