పెద్ద బాంబు వేసినవు, ప్లాన్ ఉందా అని రాజ్‌నాథ్ అన్నారు: కెసీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu
  కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి వెళ్ళనున్నారా ?

  హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. కోకాపేటలో గొల్ల కురుమ భవనానిక శంకుస్థాపన చేసి ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన శుక్రవారం సాయంత్రం మాట్లాడారు.

  కొద్ది రోజుల క్రితం తాను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశానని, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదైనా ఉందని తనను ఆయన అడిగారని కేసీఆర్ చెప్పారు. తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని చెప్పినట్లు ఆయన తెలిపారు.

   జీవితం తెలంగాణకు అంకితం

  జీవితం తెలంగాణకు అంకితం

  తన జీవిత కాలమంతా తెలంగాణకు సేవ చేయడానికి వెచ్చిస్తానని రాజ్‌నాథ్ సింగ్‌కు చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. తాను తెలంగాణకే పరిమితమవుతానని కూడా చెప్పానని అన్నారు.

  ఆ సాయం గురించి అడిగారు...

  ఆ సాయం గురించి అడిగారు...

  రైతులకు ఎకరానికి 8 వేల రూపాయలు ఇస్తున్న పథకం గురించి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారని, ఆ సొమ్మును రైతులు ఎలా తిరిగి చెల్లిస్తారని అడిగారని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే ఇస్తున్నామని తాను చెప్పానని ఆయన అన్నారు.

   రాజ్‌నాథ్ ఆశ్చర్యపోయారు...

  రాజ్‌నాథ్ ఆశ్చర్యపోయారు...

  రైతులకు ఉచితంగా ఇస్తున్నామనే చెప్పగానే రాజ్‌నాథ్ సింగ్ ఆశ్చర్యపోయారని, తనను కొనియాడారని, బాంబు వేశావన్నారని, అభివృద్దిలో తెలంగాణ దూసుకుతోందని అన్నారని కేసిఆర్ చెప్పారు. తెలంగాణలోని అన్ని జాతులు, కులాలు, వర్గాల ప్రజలు అభివృద్ది చెందినప్పుడే బంగారు తెలంగాణ కల సాధ్యమవుతుందని అన్నారు.

   బీసీలు ఆర్థికంగా బలపడాలి...

  బీసీలు ఆర్థికంగా బలపడాలి...

  రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు ఆర్థికంగా బలపడాలని, ఏ కులంలో పేదలను ఆ కుల సంఘాలు ఆదుకొంటూ ముందుకు కదలాలని, అదే చైతన్యంతో రాజకీయంగా కూడా ముందు కు వచ్చినప్పుడే తాను కలలు గన్న తెలంగాణ సాకారమవుతుందని కేసీఆర్ అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chief Minister K. Chandrasekhar Rao on Friday said that he had no plans to enter national politics.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి