ధనికులమని ముందేచెప్పా,కొంత గందరగోళం: కేసీఆర్
హైదరాబాద్: మన తెలంగాణ మనకు వస్తే దేశంలోనే ధనిక రాష్ట్రంగా మన రాష్ట్రం అవుతుందని తాను ముందే చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం శాసన సభలో అన్నారు. దేశంలోని రెండు ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పారు.
గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు మిగులు నిధులు ఉన్న రాష్ట్రాలని 14వ ఆర్థిక సంఘం తేల్చిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతుందని తాను ముందే చెప్పానని అన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పారు.
కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే ఆదాయం కొంత పెరిగిందన్నారు. ప్రస్తుతం ఎఫ్ఆర్‌బీఎం రూ.14 కోట్లకు చేరిందని, భవిష్యత్తులో రూ.16 కోట్లకు చేరుతుందన్నారు. నీతి అయోగ్‌లో అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులేనని తెలిపారు. కేంద్రం నుండి వచ్చే ఆదాయం కొంత పెరిగిందని చెప్పారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో కొంత గందరగోళం సహజమని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనలో మరికొంత అనుభవం అవవసరమని చెప్పారు. మనది కొత్త రాష్ట్రం కాబట్టి అందరి సూచనలు, సలహాలు అవసరమన్నారు. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు.
ప్రధానంగా తాము సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే అయిదారేళ్లలో తెలంగాణ ఆదాయ వ్యయం ఆరు లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. అందులో ప్రణాళిక వ్యయం రెండు లక్షల కోట్లు డెబ్బైవేల కోట్లు ఉంటుందని చెప్పారు.
ప్రణాళికేతర వ్యయం మూడు లక్షల డెబ్బై వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. తాము చెప్పినవన్నీ చేస్తున్నామన్నారు. హైదరాబాదులో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు జీవో జారీ చేసినట్లు చెప్పారు. దీనికి వెయ్యి కోట్ల వరకు వచ్చాయని చెప్పారు. భూముల అమ్మకాలు ఇంకా చేపట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications