కేసీఆర్ అందుకే ప్రగతి భవన్ నుంచి బయటకొచ్చాడు.. పుట్టలో నుంచి పాము బయటకొచ్చినట్లు.. : బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఆదరణ పెరుగుతుండటం వల్లే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టారని అన్నారు. పుట్టలో నుంచి బయటకొచ్చిన పాములా... కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకొచ్చి జిల్లాల పర్యటన చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం(జులై 9) నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పర్యటించిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

నవ్వులపాలవుతున్న కేసీఆర్ : బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... డైలాగులు కొట్టి గతంలో జనంతో చప్పట్లు కొట్టించుకున్న కేసీఆర్ ఇప్పుడవే డైలాగులతో నవ్వులపాలవుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని... అందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని సంజయ్ ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ వారిని మోసం చేశారని ఆరోపించారు. రైతు బంధు డబ్బులను బ్యాంకులు గతంలో ఇచ్చిన రుణాల కింద లాగేసుకుంటున్నాయని అన్నారు. దీంతో రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చేంతవరకూ బీజేపీ ఆయన వెంట పడుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో నాలుగు అసెంబ్లీ స్థానాలు బీజేపీనే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video

వచ్చే నెల నుంచి పాదయాత్ర....
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బండి సంజయ్ అగస్టు 9వ తేదీ నుంచి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే.హైదరాబాద్‌లోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం నాలుగైదు విడతల్లో పాదయాత్ర సాగనుంది. బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక దుబ్బాక ఉపఎన్నిక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీలో జోష్ పెరిగింది. దూకుడుగా వ్యవహరించే సంజయ్ సారథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ఆ పార్టీ ధీమాగా ఉంది.టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ... అధికార పార్టీపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications